Elephant Migration: 15 నెలలు, 500 కిలోమీటర్లు ప్రయాణించిన ఏనుగుల మందం.. ఒక్కసారిగా ఆగి ఏం చేశాయాంటే..
Elephant Migration: జంతువులు, పక్షులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసపోతాయనే విషయం తెలిసిందే. పక్షులైతే..
Elephant Migration: జంతువులు, పక్షులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసపోతాయనే విషయం తెలిసిందే. పక్షులైతే గాల్లో ఎగురుకుంటూ దేశవిదేశాలు వలసలు వెళ్లడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. మరి భారీ కాయం కలిగిన ఏనుగుల వంటి జవంతులు ఏకబిగిన వందల కిలోమీటర్లు నడుచుకుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం ఎప్పుడైనా చూశామా? ఇప్పుడు చూద్దాం పదండి. అవును మీరు వినేది నిజంగా నిజం.. ఓ ఏనుగుల గుంపు ఏకంగా 500 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా ప్రయాణించి బాగా అలసిపోయి చివరికి ఓ చోట గాఢంగా విశ్రాంతి తీసుకున్నాయి. ఈ ఘటన చైనాలో వెలుగు చూసింది. చైనా చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద వలస ఇదేనని ఆ దేశ నిపుణులు చెబుతున్నారు.
ఇంతకీ ఆ ఏనుగుల మంద ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళుతోంది. అంతదూరం వలస వెళ్లడానికి కారణం ఏంటి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చైనాలో తిరుగుతున్న ఓ ఏనుగుల మంద దాదాపు 15 నెలల ప్రయాణించి విశ్రాంతి ఓ చోట ఆగిపోయాయి. అలా అటవిలోనే మంచి స్థలం చూసుకుని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నాయి. కాగా, ఏనుగుల మందను పర్యవేక్షించడానికి, నివాస ప్రాంతాలకు వాటిని దూరంగా ఉంచడానికి అధికారులు అసాధారణ ప్రయత్నం చేశారు. అందుకోసం అనేక సాంకేతిక పరికరాలను ఉపయోగించారు చైనా అధికారులు. చైనా మీడియా ప్రకారం.. యున్నన్ ఫారెస్ట్ ఫైర్ బ్రిగేడ్ ఎనిమిది మంది బృందం ఈ ఏనుగులను డ్రోన్ల ద్వారా భూమిపై, ఆకాశం నుంచి 24 గంటలూ పర్యవేక్షిస్తోందని చెప్పారు.
డ్రోన్ తీసిన చిత్రాలలో, ఏనుగులు ప్రయాణించేటప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నట్లు చూడవచ్చు. ఈ ఏనుగుల మంద దాదాపు 15 నెలలుగా 500 కిలోమీటర్ల దూరం(300 మైళ్ళు) ప్రయాణించాయి. యునాన్ ప్రావిన్స్ నైరుతిలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ నుండి ఈ ఏనుగుల మంద వలస ప్రారంభించాయి. ఈ గుంపులో మొదట పదహారు ఏనుగులు మాత్రమే ఉండేవి. వీటిలో రెండు వెనుదిరిగి పాత ప్రాంతానికే వెళ్లగా.. మార్గమధ్యంలో ఓ గున్న ఏనుగు జన్మించింది.
నిద్రలేచి నడక ప్రారంభించిన ఏనుగులు.. స్టేట్ బ్రాడ్‌కాస్టర్ సిసిటివి ప్రకారం.. ఏనుగుల మందం మంగళవారం ఉదయం మళ్లీ నడవడం ప్రారంభించాయి. ఏనుగులను మానవ ప్రాంతాల నుండి తరలించడానికి, వాటి మార్గానికి అడ్డొచ్చిన వారిని తొలగించడానికి 410 మందికి పైగా అత్యవసర సిబ్బంది, 374 వాహనాలు, 14 డ్రోన్లను సోమవారం మోహరించారు. అంతేకాదు.. రెండు టన్నులకు పైగా ఆహారాన్ని ఆ ఏనుగులకు ఏర్పాటు చేశారు.
Also read:
Black Fungus: భయంతో చెట్లన్నీ నరికేస్తున్న ప్రజలు.. వారు చెప్పిన కారణం వింటే షాక్ అవ్వాల్సిందే..