చాణక్య నీతి: ఈ ప్రదేశాలలో ఇల్లు నిర్మించవద్దు.. లేదంటే సందప, గౌరవ భంగం కలిగే అవకాశం..

చాణక్య నీతి: ఆచార్య చాణక్య ఆర్థిక శాస్త్రంలో గొప్ప పండితుడు. దీంతో పాటు ఆయనకు నీతిశాస్త్రంలో కూడా ప్రావీణ్యం ఉంది. నేటి కాలంలో కూడా ఆయన..

  • Publish Date - 9:49 am, Thu, 10 June 21 Edited By: Phani CH
చాణక్య నీతి: ఈ ప్రదేశాలలో ఇల్లు నిర్మించవద్దు.. లేదంటే సందప, గౌరవ భంగం కలిగే అవకాశం..
Chanakya

చాణక్య నీతి: ఆచార్య చాణక్య ఆర్థిక శాస్త్రంలో గొప్ప పండితుడు. దీంతో పాటు ఆయనకు నీతిశాస్త్రంలో కూడా ప్రావీణ్యం ఉంది. నేటి కాలంలో కూడా ఆయన విధానాలు చాలా ఆచరీణయంగా ఉన్నాయి. ఆచార్య చాణక్య తన విధానాలను జీవితంలోని ప్రతి అంశంపై ప్రస్తావించారు. ఏ వ్యక్తి అయినా వారి విధానాలను అనుసరించి విజయవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటారు.. చాణక్య కూడా మనిషి విజయానికి, సంతోషకరమైన జీవితానికి ఏం చేయాలి, ఏం చేయకూడదని స్పష్టంగా చెప్పారు.

ముఖ్యంగా ఇల్లు, భూమి గురించి తెలుసుకోవలసిన అనేక విషయాలను చాణక్య ప్రస్తావించారు. ఒక ఇల్లు కొనేటప్పుడు, ఒక వ్యక్తి ఎలాంటి జాగ్రత్తగా చూసుకోవాలి అనే విషయాలను తన చాణక్య నీతిలో పేర్కొన్నారు. తద్వారా వ్యక్తులు ఎలాంటి మస్యను ఎదుర్కోగలరు, వాటిని ఎలా పరిష్కరించొచ్చు అనే విషయాలు అందులో పేర్కొన్నారు. ఇల్లు కొనుగోలు చేయడం గురించి ఆచార్య చాణక్య చెప్పిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ధనవంతులు నివసించే చోట..
ఎవరైనా ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే.. వీలైతే ధనవంతులు నివసించే ప్రదేశంలో కొనుగోలు చేయటం ఉత్తమం అని చాణక్య చెప్పారు. ఎందుకంటే.. అలాంటి ప్రదేశంలో వ్యాపార వాతావరణం బాగుంటుందట. ధనవంతులు నివసించే ఏరియాలో నివసించడం వలన ఉపాధి అవకాశాలు కూడా పొందే అవకాశం ఉంది.

మత విశ్వాసాలు ఉన్న చోట..
మత విశ్వాసం ఉన్న చోట ఇల్లు నిర్మించాలి. ప్రజలు భగవంతునిపై విశ్వాసం కలిగి ఉంటారు. ఇలాంటి చోట్లలో ప్రజలలో సామాజిక గౌరవం కూడా ఉంటుంది. పరిమితమైన సమాజం ఉన్న చోట సంస్కృతి అభివృద్ధి చెంది ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రదేశాల్లో ఇంటి నిర్మాణం మంచిదే.

చట్టం, సమాజానికి భయం ఉన్నచోట..
చట్టం, సమాజం పట్ల భయం ఉండే ప్రజల ఉన్న చోట ఒక వ్యక్తి నివసించాలని చాణక్య చెప్పారు. ఈ రెండింటిలో ఏదీ లేని ప్రదేశం ఎప్పుడూ ఉండకూడదన్నారు.

సమీపంలో వైద్యశాలలు ఉన్నచోట..
ఆచార్య చాణక్య ప్రకారం.. ఓ ఇంటి నిర్మాణం చేపట్టే ముందు సమీపంలో ఆస్పత్రి ఉందో లేదో చూసుకోవాలి. ఆస్పత్రి సమీపంలో ఉన్నచోటనే ఇంటి నిర్మాణం చేపట్టడం ఉత్తమం. కారణం.. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు అనువుగా ఉంటుంది.

నది, చెరువు సమీపంలో ఉన్న చోట..
చాణక్య ప్రకారం.. ఒక వ్యక్తి తానుు నిర్మించదలుచుకున్న ఇంటికి సమీపంలో ఒక నది లేదా చెరువు ఉంటే చాలా మంచింది. ఎందుకుంటే అలాంటి ప్రదేశంలో ఇల్లు ఉండటం వల్ల పర్యావరణం, ప్రకృతి పరంగా ప్రశాంత లభిస్తుంది.

Also read:

Sensational revelation : హత్య కేసులో మరో కొత్త కోణం.. అమ్మాయి కోసం హత్య చేశారా..! కారణం అదేనా?