Viral Video: పెళ్లి కూతురుకి విచిత్ర బహుమతి ఇచ్చిన స్నేహితుడు.. వీడియో వైరల్.. వీళ్లు ఇక మారరు అంటూ..

Viral Video: సోషల్ మీడియాలో నిరంతరం ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు రచ్చ చేస్తూనే ఉంటాయి. కొన్ని వీడియో కడుపుబ్బా నవ్విస్తుంటే..

Viral Video: పెళ్లి కూతురుకి విచిత్ర బహుమతి ఇచ్చిన స్నేహితుడు.. వీడియో వైరల్.. వీళ్లు ఇక మారరు అంటూ..
Follow us
Shiva Prajapati

| Edited By: Phani CH

Updated on: Jun 10, 2021 | 8:35 AM

Viral Video: సోషల్ మీడియాలో నిరంతరం ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు రచ్చ చేస్తూనే ఉంటాయి. కొన్ని వీడియో కడుపుబ్బా నవ్విస్తుంటే.. మరికొన్ని వీడియో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అదే సమయంలో నమ్మడానికి కష్టంగా ఉన్న వీడియో కూడా కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసి జనాలు తెగ నవ్వుకుంటున్నారు. మరి అంతలా నవ్వు పుట్టిన ఆ వీడియో సంగతేంటో ఇప్పుడు చూసేద్దాం..

ప్రతి వధూవరులకు పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైనదని అనే విషయం అందరికీ తెలిసిందే. తమ వివాహ వేడుకను చిరస్మరణీయంగా మార్చుకోవడానికి ఉన్నంతలో ఎంతో ఘనంగా పెళ్లి వేడుకను చేసుకుంటున్నారు. అయితే, పెళ్లికి వచ్చే స్నేహితులు, బంధువు మిత్రులు సైతం ఆ వివాహ వేడుక మరింత గుర్తుండిపోయేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నంలో కొందరు ప్రశంసించబడితే.. మర కొందరు అబాసుపాలవుతారు. వివాహానికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. ‘ఈ స్నేహితులు ఎప్పటికీ మారరు’ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందటే.. వధూవరులిద్దరూ వేదికగా కూర్చొని ఉన్నారు. ఇంతలో వధువు స్నేహితులు స్టేజీపైకి వచ్చారు. అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఒక బహిమతి కూడా ఇచ్చారు. ఇంతలో మరో స్నేహితుడు తన స్నేహితురాలైన వధువుకు ఒక విచిగ్ర బహుమతిని అందజేశాడు. అది ఓపెన్ చేసిన చూసిన వధువు షాక్ అవడంతో పాటు.. వరుడు కూడా బిత్తర పోయాడు. ఎందుకంటే.. ఆ గిఫ్ట్ బాక్స్‌లో చపాతీ కర్ర.. మరో వంటింటి సామాగ్రి అందులో ఉన్నాయి. అంటే వాటితో తన భర్తను నియంత్రణలో ఉంచాలనే భావనతో అలాంటి గిఫ్ట్ ఇచ్చారని స్నేహితులు సరదాగా చెబుతున్నారు.

దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. అది ఇప్పుగు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగ రచ్చ చేస్తోంది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. వీడియోను చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ‘ఈ సంవత్సరంలో నేను చూసిన ఫన్నీ వీడియో ఇదే’ అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. ఇతరులు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video:

Also read:

Silver Price Today: తగ్గిన వెండి ధరలు.. తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్‏లలో ఇవాళ సిల్వర్ రేట్స్ ఇలా..

Yoga Asanas: కోవిడ్ తగ్గినా నీరసంగా ఉందా?.. అయితే ఈ యోగాసనాలు ట్రై చెయ్యండి..