Sensational revelation : హత్య కేసులో మరో కొత్త కోణం.. అమ్మాయి కోసం హత్య చేశారా..! కారణం అదేనా?

Sushil Kumar: హత్యకు కారణం కాదన్నది కొత్త కోణం. సోను గర్ల్​ఫ్రెండ్​ వల్లే గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. భారత రెజ్లర్​ సుశీల్​ కుమార్​ హత్య కేసుకు సంబంధించి

Sensational revelation : హత్య కేసులో మరో కొత్త కోణం.. అమ్మాయి కోసం హత్య చేశారా..! కారణం అదేనా?
Sushil Kumar
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 10, 2021 | 1:48 AM

రెజ్లర్ హత్య కేసుకు సంబంధించి పలు ఆసక్తికర సంగతులను పోలీసుల విచారణలో వెలుగుచూశాయి. ఇంటి అద్దె విషయంలో వచ్చిన వాగ్వాదాలు హత్యకు కారణం కాదన్నది కొత్త కోణం. సోను గర్ల్​ఫ్రెండ్​ వల్లే గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. భారత రెజ్లర్​ సుశీల్​ కుమార్​ హత్య కేసుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెజ్లర్ సాగర్​ రానా హత్యకు అసలు కారణం ఇంటి అద్దె కాదని పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతుడు సాగర్​ స్నేహితుడు సోను గర్ల్​ఫ్రెండ్​ కారణంగానే గొడవ జరిగినట్లుగా పోలీసులు ఓ నిర్ణాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది

అసలు హత్యకు ముందు ఏం జరిగింది? సుశీల్​కు సంబంధించి ఢిల్లీలోని మోడల్​ టౌన్​ ఫ్లాట్​లో సాగర్​ రానా అద్దెకుండేవాడు. అప్పటికే అద్దె విషయంలో సుశీల్ స్నేహితుడు అజయ్​ పలుమార్లు సాగర్​కు వార్నింగ్ ఇచ్చాడు. ఫ్లాట్​ ఖాళీ చేయాలని సూచించాడు. మార్చిలో సోను​ పుట్టినరోజు సందర్భంగా అతడి స్నేహితురాలి సమక్షంలో వేడుకలు చేయలనుకున్నాడు సాగర్​. అందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు. ప్రత్యేక అతిథిగా సోను గర్ల్​ఫ్రెండ్​ను ఆహ్వానించారు.

ఇవన్నీ తెలిసి అజయ్ ఆ ఫ్లాట్​ వద్దకు చేరుకుని.. సోను గర్ల్​ఫ్రెండ్​తో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సాగర్​, సోను.. అజయ్​తో వాగ్వాదానికి దిగారు. అప్పటికే సుశీల్​, సాగర్ మధ్య గొడవలు ఉండడంతో… ఈ విషయాన్ని సుశీల్​కు చెప్పాడు అజయ్​. దీంతో వారిద్దరినీ స్టేడియానికి బలవంతంగా తీసుకొచ్చి వారిపై దాడి చేశాడు సుశీల్ గ్యాంగ్​. ఈ గొడవల్లో తీవ్రంగా గాయపడిన సాగర్​ మే 4న చనిపోయాడు. ఈ విషయాలన్నీ పోలీసులు విచారణలో తెలిసినట్లుగా సమాచారం.

ఇవి కూడా చదవండి : కేంద్రం హెచ్చరిక: అలాంటి ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు వస్తే జాగ్రత్త.. లేదంటే మోసపోవాల్సిందే..!

ప్ర‌కాశం జిల్లాలో బ‌య‌ట‌ప‌డ్డ పురాత‌న‌ వెండి నాణేలు.. ఎగ‌బ‌డ్డ స్థానికులు.. వ‌చ్చిప‌డ్డ పోలీసులు