AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murder: జార్ఖండ్‌లో ఘోరం.. బీజేపీ నాయకుడి కుమార్తె దారుణ హత్య.. కళ్లు పీకేసి, చెట్టుకు ఉరివేసి..

Murder: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణాతి దారుణ ఘటన వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికను కొందరు వ్యక్తులు అత్యంత పాశవికంగా హత్య చేశారు.

Murder: జార్ఖండ్‌లో ఘోరం.. బీజేపీ నాయకుడి కుమార్తె దారుణ హత్య.. కళ్లు పీకేసి, చెట్టుకు ఉరివేసి..
Shiva Prajapati
|

Updated on: Jun 10, 2021 | 5:49 AM

Share

Murder: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణాతి దారుణ ఘటన వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికను కొందరు వ్యక్తులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. కనుగుడ్లు పీకేసి, చిత్రహింసలకు గురి చేసి ఆపై.. చెట్టుకు ఉరివేసి చంపేశారు. ఈ అమానుష ఘటన జార్ఖండ్‌లో పలాము జిల్లా లాలిమతి అడవి ప్రాంతంలో వెలుగు చూసింది. చనిపోయిన బాలిక స్థానిక బీజేపీ నాయకుడి కూతరుగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంకీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధబార్ గ్రామంలో నివసిస్తున్న బాలిక స్థానిక బిజెపి నాయకుడి కుమార్తె. ఐదుగురు పిల్లల్లో పెద్ద కుమార్తె అయిన ఆమె.. ప్రస్తుతం 10 వ తరగతి చదువుతోంది. బాలిక హత్యకు గురైన ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ కాల్ డేటా రికార్డుల ఆధారంగా.. ఈ హత్య కేసులో ప్రదీప్ కుమార్ సింగ్ ధనుక్(23) ను అరెస్ట్ చేశారు.

కాగా, హత్యకు గురైన బాలిక జూన్ 7వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. దాంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు పంకీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తప్పిపోయిన బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. చివరికి బుధబార్ గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో చెట్టుకు మృతదేహమై కనిపించింది. పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకు పరిశీలించిన మృతదేహం.. తప్పిపోయిన బాలికదే అని నిర్ధారించుకున్నారు.

దుండగులు బాలికను అత్యంత కిరాతకంగా కొట్టి చంపినట్లు ఆమె శరీరంపై ఉన్న గాయాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, తమ కూతురుని అత్యాచారం చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉంటే బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నామని పలాము పోలీస్ సూపరింటెండెంట్(ఎస్పీ) సంజీవ్ కుమార్ తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామన్నారు.

Also read:

Google Map: గూగూల్ మ్యాప్‌తో కేస్ సాల్వ్.. బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు.. ఎక్కడంటే..

Follow Us
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!