మనిషి ప్రాణం ముఖ్యమంటోన్న సుప్రీం!.. కుక్కలతో పర్యావరణ హితమంటున్న జంతుప్రేమికులు! ఎవరి వాదన ఎంత?
గత నెల బనగానపల్లిలో.. నాలుగేళ్ల పాప మధుప్రియ ఫ్రెండ్స్‌తో ఆడుకుంటోంది. చేతిలో తినేవి ఉన్నాయని చూశాయో ఏమో..! ఒకేసారి మూడు వీధికుక్కలు ఎగబడ్డాయి. ఆ పాపను ఈడ్చుకెళ్లి ఒళ్లంతా పీకి పెట్టాయి. అక్కడివాళ్లు అలర్ట్ అయి కుక్కలను తరిమేసి, ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ.. పాప ప్రాణం మిగల్లేదు. ఆ ఇంటికి ఒక్కగానొక్క ఆడపిల్ల ఆమె. గుండెలు బాదుకుంటూ ఏడ్చారు పేరెంట్స్. ఇలా ఒకటా రెండా.. వీధికుక్కలకు బలవుతున్న వాళ్లలో 15ఏళ్లలోపు పిల్లలే ఎక్కువున్నారు.

మన దేశంలో వీధికుక్కల దాడిలో బలైపోయిన చిన్నారులు వందల్లో ఉన్నారు. మరీ ముఖ్యంగా రేబిస్ సోకి, చస్తూ బతుకుతూ చనిపోయిన పిల్లలూ ఉన్నారు. అయినంత మాత్రాన వీధికుక్కలన్నింటినీ చంపేస్తారా? ఒక మనిషి తప్పు చేశాడు కదా అని మిగిలిన మనుషులందరినీ శిక్షించడం లేదు కదా. అలాంటప్పుడు ఒకట్రెండు సంఘటనలను పట్టుకుని ఈ దాష్టీకాలేంటి? వీధిలో ఉండే కక్కులు అన్నింటిపై ఈ ప్రతాపమేంటి అని నిలదీస్తున్నారు జంతుప్రేమికులు. వాళ్ల వాదనలోనూ నిజం ఉంది. ‘వీధికుక్కలను నియంత్రించాలి’ అనే మాటే గానీ నిజానికి వాటిని చంపేస్తున్నారనేది జంతు ప్రేమికుల ఆవేదన. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే సెలబ్రిటీలు, పెట్ లవర్స్ అంతా ఎందుకని అంతగా రియాక్ట్ అయ్యారంటే.. కారణం వాటిని తీసుకెళ్లి చంపేస్తారేమో అనే భయాలే..! సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఆర్డర్స్ చూస్తే.. 8 వారాల్లో వీధి కుక్కలన్నింటినీ షెల్టర్‌లో పెట్టాలి. దేశవ్యాప్తంగా కాదు. ఒక్క ఢిల్లీ-NCRలోనే. నిజానికి ఇది ఎంత కష్టమో తెలుసా. మాజీ కేంద్రమంత్రి మేనకా గాంధీ ఓ లాజిక్ చెప్పారు వీధికుక్కలను షెల్టర్‌లో పెట్టడం ఎందుకు అసాధ్యమో. రఫ్‌గా లెక్కేసినా సరే.. ఢిల్లీ-NCRలో కనీసం 10 లక్షల వీధికుక్కలు ఉంటాయి. వీటన్నింటికీ తలదాచుకునే చోటు ఇవ్వాలంటే కనీసం 3వేల షెల్టర్స్ కట్టాలి. పైగా 8 వారాల్లో 10 లక్షల కుక్కలను కట్టడం సాధ్యమా? సరే.. సాధ్యం చేద్దామనే రంగంలోకి దిగారనుకుందాం కనీసం 500 కుక్కల వ్యాన్లు కావాలి వాటిని పట్టుకోడానికి. ఉన్నాయా అన్ని డాగ్ వ్యాన్లు?...




