Mamatha Meets Modi: సరికొత్త వ్యుహంతో హస్తిన పర్యటనలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. ప్రధాని మోదీతో 40 నిమిషాల పాటు భేటీ!

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఈ ఇద్దరూ తొలిసారిగా మర్యాదపూర్వకంగా క‌లుసుకున్నారు.

Mamatha Meets Modi: సరికొత్త వ్యుహంతో హస్తిన పర్యటనలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. ప్రధాని మోదీతో 40 నిమిషాల పాటు భేటీ!
Bengal Cm Mamata Banerjee Meets Pm Narendra Modi

Bengal CM Mamata meets PM Modi: ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీ ప‌ర్యట‌న‌లో ఉన్న ఆమె 7 లోక్ క‌ళ్యాణ్ మార్గ్‌లో ఉన్న మోదీ నివాసానికి వెళ్లారు. ఇటీవ‌ల బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఈ ఇద్దరూ తొలిసారిగా మర్యాదపూర్వకంగా క‌లుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావల్సిన నిధుల‌ గురించి ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ప్రజా సంక్షేమానికి కేటాయించిన నిధులను విడుద‌ల చేయాల‌ని మ‌మ‌తా కోరిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క‌రోనా వైర‌స్ కారణంగా భారీగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నారు. రాష్ట్రానికి కోవిడ్ వ్యాక్సిన్లను కూడా అధిక మొత్తంలో విడుదల చేయాల‌ని ఆమె కోరినట్లు తెలుస్తోంది. ఇక, య‌శ్ తుఫాన్ స‌మీక్ష స‌మ‌యంలో స్వల్ప వ్యవ‌ధి పాటు మే నెల‌లో ఇద్దరూ మాట్లాడుకున్న విష‌యం తెలిసిందే.

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం తర్వాత దీదీ.. ప్రధాని మోదీతో భేటీ అవడం ఇదే తొలిసారి. దాదాపు 40 నిమిషాల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పరిస్థితులపై ప్రధానితో చర్చించినట్లు తెలిపారు. అంతేగాక, రాష్ట్రానికి అందాల్సిన వరద సాయం, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కూడా చర్చించినట్లు ఆమె వెల్లడించారు. అలాగే, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్ర పేరును మార్చాల‌న్న పెండింగ్ అంశాన్ని కూడా ప్రధాని మోదీ దృష్టికి తీసుకువచ్చనన్నారు. దీనిపై స్పందించిన మోదీ ఆలోచిస్తామ‌ని చెప్పిన‌ట్లు ఆమె వెల్లడించారు. ఇక, మరోవైపు, గత కొంతకాలంగా పార్లమెంట్‌లో దుమారం రేపుతున్న పెగాస‌స్ వ్యవ‌హారంపై ప్రధాని మోదీ అఖిల ప‌క్ష భేటీ నిర్వహించాల‌న్నారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని దీదీ కోరారు. ఇవాళ ఉద‌యం ఢిల్లీలో కాంగ్రెస్ నేత క‌మ‌ల్‌నాథ్‌ను ఆమె క‌లిశారు. రేపు సోనియాతోనూ దీదీ భేటీ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ అవుతారు. అటు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌లతోనూ దీదీ సమావేశం కానున్నట్లు సమాచారం. ఐదు రోజుల పర్యటన నిమిత్తం మమత సోమవారం దిల్లీ చేరుకున్నారు. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని బలంగా ఢీకొట్టాలన్నది ఆమె వ్యూహంగా తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున విపక్ష నేతలంతా దిల్లీలోనే ఉన్నారు. ఈ అంశంపై వారితో చర్చించేందుకు వీలుగా తృణమూల్‌ అధ్యక్షురాలు ఢిల్లీలో పర్యటిస్తున్నారు.

Read Also…  Supreme Court: బిచ్చమెత్తుకోవాలని ఎవరు కోరుకుంటారు.. భిక్షాటనపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Click on your DTH Provider to Add TV9 Telugu