Rahul Gandhi vs Twitter: రాహుల్ గాంధీ ఎకౌంట్‌ను మేం నిలిపేయలేదు.. తాత్కాలికంగా లాక్ అయింది: ట్విట్టర్
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఎకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆ పార్టీ పలు ఆరోపణలు కూడా చేసింది. అయితే ట్విట్టర్ వీటిని తొసిపుచ్చుతూ.. రాహుల్ గాంధీ ఎకౌంట్ తాత్కాలికంగా..
Rahul Gandhi vs Twitter: ట్విట్టర్.. ఇండియాలోని కీలక వ్యక్తుల ఎకౌంట్లకు బ్లూటిక్‌లు తీసేస్తూ షాకులిస్తోంది. ఆ తరువాత వచ్చిన నిరసనలతో మళ్లీ ఆ టిక్‌లు యాడ్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. జూన్ నెలలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు మరి కొంతమంది కీలక రాజకీయ నేతల ట్విట్టర్ ఎకౌంట్లకు బ్లూ టిక్ తీసేసింది. మొన్న టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి కూడా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఎకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆ పార్టీ పలు ఆరోపణలు కూడా చేసింది. అయితే వీటిని తొసిపుచ్చుతూ.. రాహుల్ గాంధీ ఎకౌంట్ తాత్కాలికంగా లాక్ అయిందని వివరణ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ట్విట్టర్, కాంగ్రెస్ పార్టీకి మధ్య వార్ నడుస్తోంది. కాగా, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. రాహుల్‌గాంధీ ట్విటర్ ఎకౌంట్ కొద్దిసేపు నిలిపివేసినట్లు, పునరుద్ధరించే ప్రక్రియ జరుగుతోందని ట్విటర్ వెల్లడించిన ట్వీట్‌ను కాంగ్రెస్ తన అధికారిక ట్విటర్‌లో పంచుకుంది. అయితే, అప్పటివరకు రాహుల్ గాంధీ ఇతర సోషల్ మీడియా యాప్‌లతో ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొంది.
కాగా, దిల్లీలో 9 ఏళ్ల బాలిక హత్యాచార ఘటన జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆ బాలిక తల్లిదండ్రుల వివరాలను రాహుల్ ట్విట్టర్‌లో ఓ ఫొటోతో పాటు పంచుకున్నాడు. అయితే ఈ ఫొటోను ట్విటర్ తొలగించింది. దీంతోనే రాహుల్ గాంధీ ఖాతాను నిలిపివేసిట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తిం చేసింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ ట్విటర్ ఎకౌంట్‌ను నిలిపియేయలేదని, సర్వీస్‌లో భాగంగా అలా జరిగిందని, తిరిగి ఆయన ఎకౌంట్ కొనసాగుతుందని ట్విట్టర్ పేర్కొంది.
తొమ్మిదేళ్ల బాలిక కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించేందుకు వెళ్లారు. అప్పుడు తీసిన ఫొటోను రాహుల్ గాంధీ తన ట్విటర్ ఎకౌంట్‌లో పంచుకున్నాడు. పోక్సో చట్టం నిబంధనలను అతిక్రమించి, బాధిత కుటుంబం వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తక్షణమే ఆ పోస్టును, ఫొటోను తొలగించాల్సిందిగా ట్విటర్‌ను ఆదేశించింది. దీంతో రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఫొటోను తొలగించి, ఎకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపేసిన్లు తెలుస్తోంది.
The account has been temporarily locked. https://t.co/MYqpC8OeIb
— Congress (@INCIndia) August 7, 2021
Also Read: Old is Gold: అప్పట్లో అలా..తాజ్ హోటల్ ఒకరోజుకి ఛార్జ్..ఫియట్ మొదటి కారు ఖరీదు ఎంతో తెలుసా?
‘క్విట్ ఇండియా యానివర్సరీ’.. యూపీలో 9 న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ భారీ నిరసన ప్రదర్శనలు