Parking lot collapses Video: ఒక్కసారిగా కుప్పకూలిన పార్కింగ్‌ స్థలం.. 12 వాహనాలు ధ్వంసం.. వీడియో వైరల్

సుమారు 12 వాహనాలు పార్కు చేసి ఉన్న పార్కింగ్‌ స్థలం హఠాత్తుగా కుప్పకూలింది. అనంతరం అక్కడ భారీ గుంత ఏర్పడింది. పంజాబ్​మొహాలిలోని మొహిలీలోని ఇండస్ట్రీయల్​ ఏరియా, సెక్టార్ 83లో బుధవారం (జూన్ 14) ఈ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఈ గుంతలో పడి..

Parking lot collapses Video: ఒక్కసారిగా కుప్పకూలిన పార్కింగ్‌ స్థలం.. 12 వాహనాలు ధ్వంసం.. వీడియో వైరల్
Parking Lot Collapses
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 15, 2023 | 11:15 AM

మొహిలీ: సుమారు 12 వాహనాలు పార్కు చేసి ఉన్న పార్కింగ్‌ స్థలం హఠాత్తుగా కుప్పకూలింది. అనంతరం అక్కడ భారీ గుంత ఏర్పడింది. పంజాబ్​మొహాలిలోని మొహిలీలోని ఇండస్ట్రీయల్​ ఏరియా, సెక్టార్ 83లో బుధవారం (జూన్ 14) ఈ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఈ గుంతలో పడి సుమారు పది బైక్‌లు, రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ధృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాహనాలన్నీ గుంతలో పడిపోవడం వీడియోలో కనిపిస్తుంది. మొహిలీలోని సెక్టార్‌ 83లోని ఐటీ సిటీ ఇండస్ట్రియల్‌ ఏరియాలో బుధవారం మధ్యాహ్నం 12:45 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా తెలుస్తోంది. సంఘటన సంమయంలో కుప్పకూలిన పార్కింగ్‌ భవనంలో అనేక మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.

కుప్పకూలిన పార్కింగ్​ స్థలం పక్కనే భవన నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతున్నాయని, ఆ భవనానికి బేస్‌మెంట్ తవ్వుతుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ఐతే గుంతలో పడిపోయిన కొన్ని వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకుని, పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని, చుట్టుపక్కల ఉన్న సీసీటీవీలను పరిశీలిస్తున్నట్లు మొహిలీ డీఎస్‌పీ హర్సిమ్రాన్ సింగ్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.