PM Narendra Modi: ‘నో యువర్ కంట్రీ’ కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్ విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ
'నో యువర్ కంట్రీ' కార్యక్రమం కింద దేశవ్యాప్త పర్యటనకు బయలు దేరిన విద్యార్థులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ మచ్చటించారు. జమ్మూ కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన 250 మంది విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. విద్యార్థుల అలవాట్లు, అభిరుచులు, లక్ష్యాల గురించి ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు.

‘నో యువర్ కంట్రీ’ కార్యక్రమం కింద దేశవ్యాప్త పర్యటనకు బయలు దేరిన విద్యార్థులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ మచ్చటించారు. జమ్మూ కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన 250 మంది విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. జమ్మూ కాశ్మీర్‌లోని దాదాపు అన్ని జిల్లాల నుండి వెనుకబడిన ప్రాంతానికి చెందిన 250 మంది విద్యార్థులు భారత దేశాన్ని సందర్శిస్తున్నారు. ఈ విద్యార్థులు ఇప్పటివరకు జైపూర్, అజ్మీర్, ఢిల్లీ ప్రాంతాలను సందర్శించారు.
‘వతన్ కో జానో’ కార్యక్రమం కింద ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని 250 మంది విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ విద్యార్థులతో ఫొటోలు దిగారు. విద్యార్థులు చప్పట్లతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. విద్యార్థుల అలవాట్లు, అభిరుచులు, లక్ష్యాల గురించి ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వారితో ముచ్చటించారు. దీంతో పాటు దేశంలో విద్యా, ఉద్యోగ, క్రీడా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో ‘స్పోర్ట్స్ ఫర్ ఏఐఐ’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నట్లు మోదీ ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…