Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Small Saving Scheme: సుకన్య సమృద్ధి, PPF ఖాతాను బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు మార్చాలని అనుకుంటున్నారా.. ఇలా బదిలీ చేయండి..

మీరు స్మాల్ సేవింగ్ స్కీమ్ కింద తెరిచిన ఖాతాను బదిలీ చేయాలనుకుంటే.. మీరు దీన్ని ఎలా చేయవచ్చో తెలుసా..

Small Saving Scheme: సుకన్య సమృద్ధి, PPF ఖాతాను బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు మార్చాలని అనుకుంటున్నారా.. ఇలా బదిలీ చేయండి..
Sukanya Samriddhi Yojana
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 15, 2023 | 7:41 PM

స్మాల్ సేవింగ్ స్కీమ్ ఖాతా కింద పెట్టుబడి పెట్టే వ్యక్తులు రిస్క్ లేకుండా వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. దీనితో పాటు పన్ను మినహాయింపు , ఇతర ప్రయోజనాలను అందిస్తారు. చిన్న పొదుపు పథకం కింద ఖాతాని బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు మార్చవచ్చు. కానీ మీరు ఖాతాను బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు బదిలీ చేయాలనుకుంటే.. మీరు దీన్ని చాలా ఈజీ పద్దతిలో.. సులభంగా మార్చుకోవచ్చు.

అదే సమయంలో, సీనియర్ సిటిజన్ సేవింగ్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన కింద తెరవబడిన ఖాతాను పోస్టాఫీసు నుంచి బ్యాంకుకు, పోస్టాఫీసులోని ఒక శాఖ నుంచి మరొక శాఖకు బదిలీ చేయవచ్చు. మీరు కూడా దీన్ని చేయాలనుకుంటే.. మీరు ఈ పనిని ఎలా పూర్తి చేయవచ్చో మాకు తెలియజేయండి.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ను ఎలా బదిలీ చేయాలి

ఈ పథకాన్ని బ్యాంకు నుండి పోస్టాఫీసుకు, పోస్టాఫీసు నుండి బ్యాంకుకు బదిలీ చేయవచ్చు. ఇందుకోసం ఎక్కడికైనా బ్యాంకుకు, పోస్టాఫీసుకు వెళ్లాల్సిందే. ఇక్కడ మీరు పూర్తి చిరునామాతో బదిలీ ఫారమ్‌ను పూరించి సమర్పించాలి. దీంతోపాటు జీఎస్టీతోపాటు పాస్ బుక్ కాపీ, రూ.100 సమర్పించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

PPF ఖాతాను బదిలీ చేయడానికి ఛార్జీలు ఎంత..?

ఈ ఖాతాను కూడా అదే ప్రక్రియ కింద బదిలీ చేయవచ్చు. దీనిని పోస్టాఫీసు నుండి బ్యాంకుకు లేదా బ్యాంకు నుండి పోస్టాఫీసుకు బదిలీ చేయవచ్చు. దీని కోసం, బ్యాంకులు, పోస్టాఫీసులు మీకు రూ. 100 + GST ​​రుసుము వసూలు చేస్తాయి.

సుకన్య సమృద్ధి ఖాతాను ఎలా బదిలీ చేయాలంటే..

సుకన్య సమృద్ధి ఖాతాను బ్యాంక్ నుండి పోస్టాఫీసుకు, పోస్టాఫీసు నుండి బ్యాంకుకు బదిలీ చేయడానికి, మీరు రూ 100 + GST ​​రుసుము చెల్లించాలి. దీనితో పాటు, ఇతర పథకాల మాదిరిగానే, ఈ పథకాన్ని కూడా బదిలీ చేయడానికి, పాస్‌బుక్, చిరునామాతో పాటు బదిలీ ఫారమ్‌ను నింపి బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు అందించాలి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం