Madhyapradesh: ఉజ్జయినిలో వర్షం బీభత్సం..కూలిన మహాకాళేశ్వరుడి ఆలయం గోడ, ఇద్దరు భక్తులు మృతి, కొనసాగుతోన్న రెస్క్యూ

ఉజ్జయినిలో గత కొన్ని రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. అయితే ఈ వర్షం మహాకాళేశ్వర ఆలయ ప్రాంతంలో వర్షం బీభత్సం సృష్టించింది. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయం గేట్ నంబర్ 4 వద్ద జ్యోతిషాచార్య పండిత ఆనంద్ శంకర్ వ్యాస్ ఇంటి సమీపంలో పాత గోడ కూలిపోయింది. గోడ దగ్గర సరుకులు అమ్ముకునే కొందరు ఈ శిధిలాల కింద చిక్కుకున్నారు. గోడ కూలిపోవడంతో కొంత మంది శిథిలాల కింద సమాధి అయ్యారని మహాకాళేశ్వర ఆలయ నిర్వాహకులకు సమాచారం అందింది.

Madhyapradesh: ఉజ్జయినిలో వర్షం బీభత్సం..కూలిన మహాకాళేశ్వరుడి ఆలయం గోడ, ఇద్దరు భక్తులు మృతి, కొనసాగుతోన్న రెస్క్యూ
Mahakaleswara Temple
Follow us
Surya Kala

|

Updated on: Sep 27, 2024 | 9:02 PM

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఆలయం గేట్ నంబర్ 4 గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్లు నిర్ధారించారు. కొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. గాయపడిన భక్తులను రెస్క్యూ టీం వెంటనే శిథిలాల నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆలయం వద్ద రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు వేగంగా చేస్తున్నారు. ఉజ్జయినిలో భారీ వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఉజ్జయినిలో గత కొన్ని రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. అయితే ఈ వర్షం మహాకాళేశ్వర ఆలయ ప్రాంతంలో వర్షం బీభత్సం సృష్టించింది. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయం గేట్ నంబర్ 4 వద్ద జ్యోతిషాచార్య పండిత ఆనంద్ శంకర్ వ్యాస్ ఇంటి సమీపంలో పాత గోడ కూలిపోయింది. గోడ దగ్గర సరుకులు అమ్ముకునే కొందరు ఈ శిధిలాల కింద చిక్కుకున్నారు. గోడ కూలిపోవడంతో కొంత మంది శిథిలాల కింద సమాధి అయ్యారని మహాకాళేశ్వర ఆలయ నిర్వాహకులకు సమాచారం అందింది.

వెంటనే స్పందించి.. సంఘటన గురించి పరిపాలనా అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బందిని వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మహాకాళేశ్వర పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఆలయ సిబ్బంది సహాయంతో శిథిలాల నుంచి క్షతగాత్రులను శిధిలాల నుంచి బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో.. ఇంకా ఎంతమందిని రెస్క్యూ టీమ్ బయటకు తీయాల్సి ఉందో తెలియాల్సి ఉంది. రెస్క్యూ టీమ్ నిరంతరం రెస్క్యూ పనిలో నిమగ్నమై ఉంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు ఎస్పీ ప్రదీప్ శర్మ ధృవీకరించారు.

ఇవి కూడా చదవండి

గోడ దగ్గర నిలబడి ఉన్న ప్రజలు

భారీ వర్షం కురుస్తోందని.. తాము గేట్ నంబర్ 4 వద్ద గొడుగు పట్టుకుని నిలబడి ఉన్నామని సంఘటన ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అకస్మాత్తుగా గోడ కూలిపోవడంతో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి గోడ కింద సమాధి అయ్యారు. గోడ కూలడంతో ఎంతమంది భక్తులు గాయపడ్డారో ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?