AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: డబ్బులు డ్రా చేయడానికి అత్త మృతదేహంతో బ్యాంక్ కు చేరుకున్న అల్లుడు.. ఎలా పట్టుబడ్డాడంటే..?

మానవత్వం, సంబంధాలు ఏ రేంజ్ లో విచ్ఛిన్నం అవుతున్నాయో తెలుపుతున్న ఈ ఉదంతం తడియావాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ సమాచారం ఇస్తూ.. వెరిఫికేషన్ కోసం వృద్ధురాలి చూడాడానికి కారు దగ్గరకు రమ్మనమని అల్లుడు కోరడంతో తాను కారు వద్దకు వెళ్ళినట్లు చెప్పాడు. అయితే తాను ఆ మహిళతో మాట్లాడుతున్నప్పుడు శరీరంలో ఎలాంటి కదలిక లేదని.. దీంతో ఆ వృద్ధురాలి పల్స్‌ను పరిశీలించినట్లు చెప్పారు.

Uttar Pradesh: డబ్బులు డ్రా చేయడానికి అత్త మృతదేహంతో బ్యాంక్ కు చేరుకున్న అల్లుడు.. ఎలా పట్టుబడ్డాడంటే..?
Uttar Pradesh Crime News
Surya Kala
|

Updated on: Sep 27, 2024 | 5:04 PM

Share

మనిషికి రోజురోజుకీ డబ్బు పిచ్చి పెరిగిపోతుంది. ఎంతగా అంటే చచ్చిన వ్యక్తులను కూడా డబ్బు సంపాదనకు ఓ వస్తువుగా వినియోగించుకునేటంతగా.. మానవ బంధాలు అన్నీ ఆర్ధిక బంధాలే అనేటంతగా.. ఇందుకు సాక్ష్యంగా తాజాగా ఓ సంఘటన నిలుస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. వృద్ధురాలి అల్లుడు.. ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా వృద్ధురాలు డిపాజిట్ చేసిన డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు కారులో నేరుగా బ్యాంకు వద్దకు తీసుకునివెళ్లాడు. డబ్బులు డ్రా చేసే ఫారాన్ని బ్యాంక్ సిబ్బందికి సమర్పించాడు. అనంతరం వృద్ధురాలు అల్లుడు తన అత్తగారికి అనారోగ్యంగా ఉందని బ్యాంక్ మేనేజర్‌కు సమాచారం ఇచ్చాడు. బ్యాంకు మేనేజర్ వెరిఫికేషన్ కోసం మహిళను సంప్రదించగా.. ఆమె శరీరంలో ఎలాంటి కదలిక కనిపించలేదు. దీంతో బ్యాంకు మేనేజర్ డబ్బులు డ్రా చేసుకునేందుకు నిరాకరించాడు.

మానవత్వం, సంబంధాలు ఏ రేంజ్ లో విచ్ఛిన్నం అవుతున్నాయో తెలుపుతున్న ఈ ఉదంతం తడియావాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ సమాచారం ఇస్తూ.. వెరిఫికేషన్ కోసం వృద్ధురాలి చూడాడానికి కారు దగ్గరకు రమ్మనమని అల్లుడు కోరడంతో తాను కారు వద్దకు వెళ్ళినట్లు చెప్పాడు. అయితే తాను ఆ మహిళతో మాట్లాడుతున్నప్పుడు శరీరంలో ఎలాంటి కదలిక లేదని.. దీంతో ఆ వృద్ధురాలి పల్స్‌ను పరిశీలించినట్లు చెప్పారు. అప్పుడు శరీరంలో ప్రాణం లేదని అర్ధం అయి.. డబ్బులు విత్ డ్రా చెయ్యడానికి అంగీకరించలేదని చెప్పాడు.

బ్యాంక్ లో రచ్చ చేసిన మృతురాలు సభ్యులు

డబ్బులు చెల్లింపు ఆగిపోవడంతో చనిపోయిన వృద్ధురాలి అల్లుడు సహా కుటుంబ సభ్యులు మృతదేహాన్ని బ్యాంకులో ఉంచి రచ్చ చెయ్యడం మొదలు పెట్టారు. అనంతరం ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు బ్యాంక్ సిబ్బంది. స్థానిక ప్రజలు, బ్యాంకు ఉద్యోగులు ఇచ్చిన సమాచారం ప్రకారం తడియావాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాముపూర్ సఖిన్‌లో నివసిస్తున్న 60 ఏళ్ల రమా శ్రీ చాలా కాలంగా అనారోగ్యంతో ఉందని ASP మార్తాండ్ సింగ్ తెలిపారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అక్కడ వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యులు మరో ఆస్పత్రికి తీసుకెళ్ళమని చెప్పారు. అలా మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రమ శ్రీ మృతి చెందింది.

ఇవి కూడా చదవండి

బ్యాంకు ఖాతాలో 49 వేల రూపాయలు

రమ శ్రీ బ్యాంకు ఖాతా పీఎన్‌బీ బ్రాంచ్‌లో ఉందని.. అందులో రూ.49,000 డబ్బులు ఉన్నాయని ఏఎస్పీ మార్తాండ్ సింగ్ తెలిపారు. డబ్బులు తీసుకునేందుకు మృతురాలి అల్లుడు మృతదేహంతో నాటకం మొదలు పెట్టాడు. ఆమె బతికి ఉన్నట్టుండి కారులో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు చేరుకున్నాడు. అయితే బ్యాంకు మేనేజర్ తెలివిగా వ్యవహరించడంతో అల్లుడి ప్లాన్ సక్సెస్ కాలేదు. ఆందోళన అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. మొత్తం వ్యవహారంపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..