Black Magic: ఓ ప్రైవేట్ స్కూల్ యాజమన్యం నిర్వాకం.. స్కూల్ప్రతిష్ఠ కోసం రెండో తరగతి విద్యార్థి నరబలి
అజ్ఞానాంధకారాన్ని తొలగించి సమాజంలో మార్పు తీసుకురావల్సిన ఉపాధ్యాయులు మూఢనమ్మకాల ముసుగులో దారుణానికి పాల్పడ్డారు. తమ ప్రైవేట్ స్కూల్ వంద కాలాల పాటు చల్లగా ఉండాలని ఓ పసివాడిని నరబలి ఇచ్చారు. తమ పాఠశాల ప్రతిష్ఠను పెంచుకునేందుకు అక్కడే చదువుతున్న రెండో తరగతి బాలుడిని గుట్టుచప్పుడు కాకుండా పాఠశాల యాజమాన్యమే దగ్గరుంచి బలిచ్చారు..
లక్నో, సెప్టెంబర్ 27: అజ్ఞానాంధకారాన్ని తొలగించి సమాజంలో మార్పు తీసుకురావల్సిన ఉపాధ్యాయులు మూఢనమ్మకాల ముసుగులో దారుణానికి పాల్పడ్డారు. తమ ప్రైవేట్ స్కూల్ వంద కాలాల పాటు చల్లగా ఉండాలని ఓ పసివాడిని నరబలి ఇచ్చారు. తమ పాఠశాల ప్రతిష్ఠను పెంచుకునేందుకు అక్కడే చదువుతున్న రెండో తరగతి బాలుడిని గుట్టుచప్పుడు కాకుండా పాఠశాల యాజమాన్యమే దగ్గరుంచి బలిచ్చారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లోని రస్‌గవాన్‌లోని డీఎల్ పబ్లిక్ స్కూల్‌లో వందలాది విద్యార్ధులు చదువుతున్నారు. ఈ స్కూల్‌కు హాస్ట్ సౌకర్యం కూడా ఉంది. అయితే తమ పాఠశాలకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు రావాలని, సక్సెస్ బాటలో నడవాలని అక్కడి యాజమన్యం క్షుద్రపూజలు నిర్వహించారు. అయితే క్షుద్రపూజలో భాగంగా స్కూల్ యాజమాన్యం అక్కడి హాస్ట్‌లో ఉంటున్న కృతార్థ్ (11) అనే విద్యార్థిని నరబలి ఇచ్చింది. స్కూల్ హాస్టల్‌లోనే బాలుడిని చంపేసి చేతులు దులుపుకున్నారు. ఈ వారం ప్రారంభంలో జరిగిన ఈ ఘోరం తాజాగా వెలుగులోకి వచ్చింది.
పాఠశాల డైరెక్టర్ తండ్రి బ్లాక్ మ్యాజిక్‌ను విశ్వసిస్తాడని పోలీసులు తెలిపారు. తొలుత స్కూల్ బయట ట్యూబ్‌వెల్ సమీపంలో ఆ పిల్లాడిని చంపాలనుకున్నారని, అయితే హాస్టల్ నుంచి బయటకు తీసుకెళ్తున్నప్పుడు బాలుడు భయంతో కేకలు వేయడంతో వారు గొంతు నులిమి హత్యచేసినట్లు పోలీసుల ఎదుట నేరం అంగీకరించారు. పాఠశాల సమీపంలో ‘బ్లాక్ మ్యాజిక్’కు వినియోగించిన వస్తువులు లభ్యమయ్యాయి. నిందితులు సెప్టెంబరు 6న 9 ఏళ్ల మరో విద్యార్థిని బలి ఇచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
విద్యార్థి తండ్రి చేసిన ఫిర్యాదు ప్రకారం.. సోమవారం పాఠశాల యాజమాన్యం నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, తన కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడని వారు సమాచారం అందించినట్లు తెలిపారు. కారులో డైరెక్టర్ బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లాడని సిబ్బంది వెల్లడించారు. తర్వాత అతడి కారులో తన కుమారుడి మృతదేహం కనిపించిందని చెప్పారు. ఈ ఘటనలో పాఠశాల యజమాని జశోధన్ సింగ్, అతని కుమారుడు, స్కూల్ డైరెక్టర్ దినేష్ బాఘేల్, ముగ్గురు టీచర్లతో సహా మొత్తం ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.