Waqf: వక్ఫ్ బోర్డులో కొత్తగా నియామకాలు చేపట్టొద్దన్న సుప్రీం కోర్టు! కౌంటర్ దాఖలుకు వారం గడువు కోరిన కేంద్రం
సుప్రీం కోర్టులో వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ 73 పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, వక్ఫ్ బోర్డుల్లో నియామకాలకు స్టే విధించింది. మే 5న తదుపరి విచారణ షెడ్యూల్ చేసింది. కేంద్రం వక్ఫ్ బై యూజర్‌ను అమలు చేయదని తెలిపింది.

వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో 73 పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మసనం వీటిపై విచారణ చేపట్టింది. వక్ఫ్ బోర్డులకు ముస్లిమేతరులను అనుమతించినట్లు.. హిందూ ట్రస్టుల్లోకి ముస్లింలను అనుమతిస్తారా? అంటూ తాజాగా సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే చట్టంలోని పలు అంశాలపై కూడా కేంద్రాన్ని ప్రశ్నించింది. కాగా వక్ఫ్ చట్టంపై దాఖలపై పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసేందుకు వారం రోజుల గడువు కావాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్ధించింది. కేంద్రం విజ్ఞప్తికి సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. అప్పటివరకు వక్ఫ్ చట్టంపై యధాతథా స్థితి కొనసాగించాలని ఆదేశించింది.
వక్ఫ్ బోర్డుల్లో ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. వక్ఫ్ చట్టంపై సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ చట్టంపై విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. వక్ఫ్ బై యూజర్‌ను అమలు చేయబోమని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. వక్ఫ్ బోర్డు, కౌన్సిల్‌లో ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్ని పిటిషన్లను విచారించడం సాధ్యం కాదని, తొలుత దాఖలైన 5 పిటిషన్లను విచారిస్తామని సీజేఐ సంజీవ్‌ఖన్నా వెల్లడించారు. వక్ఫ్‌లో ముస్లిమేతరులను నియమించరాదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీ నోటిఫై చేయబోమని కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
