‘చిన్నమ్మ’ పొలిటికల్ ఎంట్రీపై కొనసాగుతున్న సస్పెన్స్…. ఆమె వస్తారా…? రారా ..?
తమిళనాడులో అన్నా డీఎంకే బహిష్కృత నేత శశికళ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా..రారా అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది.దీనిపై మిశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల్లో అన్నా డీఎంకే ఓటమి తరువాత పరిణామాలు చకచకా మారాయి.
తమిళనాడులో అన్నా డీఎంకే బహిష్కృత నేత శశికళ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా..రారా అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది.దీనిపై మిశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల్లో అన్నా డీఎంకే ఓటమి తరువాత పరిణామాలు చకచకా మారాయి. తాను రాజకీయాల జోలికి పోనని, రాష్ట్రంలో ఏఐఏడీఎంకే పటిష్టం కావాలని, అధికారంలోకి రావాలని ఒకప్పుడు ప్రకటించిన ఆమె.. తరువాత తన మనసు మార్చుకున్నారు. అమ్మా//మీరు ఎప్పుడు క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారని ఓ కార్యకర్త ప్రశ్నించగా అధైర్య పడవద్దని, కోవిద్ పాండమిక్ అనంతరం వస్తానని ఆమె అతనికి చెప్పినట్టు తెలుస్తోంది. ఇది గత మే నెల చివరివారంలో వీరి సంభాషణ అట..సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. ఇదే సమయంలో శశికళ.. అన్నా డీఎంకే నేత, మాజీ సీఎం పళనిస్వామిని తీవ్రంగా విమర్శించారట.తన రాజకీయ పతనానికి ఆయనే కారణమని ఆరోపించారట.. కాగా అన్నా డీఎంకే కార్యకర్త కూడా ఒకరు అడిగిన ప్రశ్నకు ఆమె ఇలాగే సమాధానమిచ్చారని తెలిసింది. కానీ పళనిస్వామి మాత్రం పార్టీలోకి ఆమె రాకను వ్యతిరేకిస్తున్నారు. ఆమె రాక వల్ల పార్టీ మరింత నాశనమవుతుందని అంటున్నారు. నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన ఆమె ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదు. అయితే తిరిగి పార్టీని తను శాసించగలుగుతానని, రాష్ట్రంలో చక్రం తిప్పగలుగుతానని ఆమె భావిస్తున్నట్టు కనబడుతోంది.
ముఖ్యంగా ఎన్నికల్లో పార్టీ ఓటమి ఆమెకు కలిసి వచ్చేట్టు ఉండు. ఆమె మద్దతుదారులు కూడా తిరిగి ఆమె నాయకత్వాన్ని కోరుతున్నట్టు సమాచారం.. ఎన్నికల్లో అన్నా డీఎంకే ఓడిపోయినా 66 సీట్లను గెలుచుకోవడంతో.. పళనిస్వామి మాత్రం స్ట్రాంగ్ గా ఉన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: పేదల కోసం ఇప్పటి వరుకు 14 లక్షల రూపాయాలు ఖర్చుపెట్టా..సోహెల్ ఎమోషనల్ వర్డ్స్: Syed Sohel video.
Kaushal Manda funny dance video:బేటీతో కౌశల్ మంద ఫన్నీ డ్యాన్స్. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..