Covid-19 Second Wave: వైద్యరంగంపై కరోనా పంజా.. సెకండ్ వేవ్‌లో 719 మంది మృతి.. తెలుగు రాష్ట్రాల్లో..
Doctors - Coronavirus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలు చేరువలో కేసులు నమోదవుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో కరోనా వైద్యరంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సెకండ్ వేవ్‌లో
Doctors – Coronavirus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలు చేరువలో కేసులు నమోదవుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో కరోనా వైద్యరంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సెకండ్ వేవ్‌లో కోవిడ్ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) శనివారం వెల్లడించింది. అత్యధికంగా బీహార్ రాష్ట్రంలో 111 మంది వైద్యులు కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఢిల్లీలో 109 మంది, ఉత్తరప్రదేశ్‌లో 79 మంది, పశ్చిమ బెంగాల్‌లో 63 మంది, రాజస్థాన్‌లో 43 మంది, జార్ఖండ్‌లో 39 మంది, గుజరాత్‌లో 37, తెలంగాణలో 36 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 35 మంది తమిళనాడులో 32 మంది మృతి చెందారని ఐఎంఏ తెలిపింది. కాగా.. కరోనా మొదటి వేవ్‌లో దేశవ్యాప్తంగా 748 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు.
Indian Medical Association (IMA) says 719 doctors died during second wave of COVID-19 pandemic; maximum 111 doctors lost their lives in Bihar, followed by Delhi (109) pic.twitter.com/4CCFSIMZj6
— ANI (@ANI) June 12, 2021
కాగా.. గత 24 గంటల్లో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. నిన్న కరోనా బారిన పడి 4,002 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 3,67,081కి చేరుకుంది. కాగా.. ప్రస్తుతం 10,80,690 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం కరోనా నుంచి 1,21,311 మంది కోలుకున్నారు. వీరితో కలిపి రికవరీల సంఖ్య 2,79,11,384కి చేరింది.
Also Read: