Leopard Hunts Dog: ఇంటి బయట పడుకున్న కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత.. షాకింగ్ వీడియో..

Leopard Hunts Pet Dog: దేశంలో ఇటీవల కాలంలో తరచూ చిరుత పులుల దాడి సంఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్‌లో ఇంటిబయట

Leopard Hunts Dog: ఇంటి బయట పడుకున్న కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత.. షాకింగ్ వీడియో..
Leopard Hunts Pet Dog
Follow us

|

Updated on: Jun 12, 2021 | 11:29 AM

Leopard Hunts Pet Dog: దేశంలో ఇటీవల కాలంలో తరచూ చిరుత పులుల దాడి సంఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్‌లో ఇంటిబయట ఆడుకుంటున్న చిన్నారిని సైతం చిరుత ఎత్తుకెళ్లి పొట్టన బెట్టుకుంది. అటవీ ప్రాంతంలోని పరిసరాల్లో పశువులపై కూడా దాడి సంఘటనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఓ చిరుతపులి నేరుగా ఇంటికి వచ్చి.. బయట పడుకున్న కుక్కును ఎత్తుకెళ్లింది. ఇదంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాషిక్‌ సమీపంలో ఉన్న భూసె గ్రామంలో జరిగింది.

అర్ధరాత్రి వేళ భూసే గ్రామంలోని ఓ ఇంటి ముందు పడుకున్న పెంపుడు కుక్కను.. చిరుత ఎలాంటి అలికిడి చేయకుండా దానిని నోట కరుచుకుని వెళ్లిపోయింది. వాస్తవానికి కొంచెం అలికిడి జరిగినా కుక్కలు వెంటనే మేల్కోంటాయి. అలాంటి కుక్క ఆ ప్రమాదాన్ని గ్రహించే లోపే చిరుత దాడి చేసి నోట కరుచుకుని తీసుకెళ్లింది. ఈ సంఘటన అంతా ఆ ఇంటికి పరిసరాల్లో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఇంకెందుకు ఆలస్యం వీడియోను చూడండి..

దీంతో భూసే గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే చిరుతను పట్టుకోవాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో సిబ్బందిని మోహరించి చిరుత జాడ కనుగునేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లంతా భయంతో పలు కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Mehul Choksi: ‘వాటిని పరిగణలోకి తీసుకోం’.. మెహుల్‌ చోక్సీకి బెయిల్ నిరాకరించిన డొమినికా కోర్టు

TV9 Impact: మూడేళ్ల చిన్నారి ప్రాణం నిలిపిన ఇంజక్షన్‌ ఖరీదు 16 కోట్లు.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా అపన్న హస్తం అందించిన దాతలు

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు