V Hanumantha Rao: తెలంగాణ బీసీ గర్జన సభకు రండి.. కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆహ్వానించిన వీహెచ్..
కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు కలిశారు. బెంగళూర్‌లోని ఆయన నివాసంలో కలిసి రెండవసారి సీఎంగా గెలిచినందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జూన్‌లో తెలంగాణలో జరగనున్న బీసీ గర్జన సభకు ..

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు కలిశారు. బెంగళూర్‌లోని ఆయన నివాసంలో కలిసి రెండవసారి సీఎంగా గెలిచినందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జూన్‌లో తెలంగాణలో జరగనున్న బీసీ గర్జన సభకు ముఖ్యఅతిథిగా రావాలని సిద్దరామయ్యను ఆహ్వానించారు. ఇదే విషయంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సి.ఎల్.పి నాయకుడు కూడా ఆహ్వానం అందిస్తారని సిద్ధరామయ్య కు వి.హెచ్ హనుమంతరావు తెలిపారు.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దశాబ్ది వేడుకలకు ధీటుగా తెలంగాణ దశాబ్ధి వేడుకలను జరిపేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగాప్రతీ నెలా మొదటి వారంలో పీఏసీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 2 నుంచి తొమ్మిదేళ్ల లో కేసీఆర్ వైఫల్యాలపై.. ఫెయిల్యూర్ కేసీఆర్ .. స్లోగన్ తో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. బీఆర్‌ఎస్ వైఫల్యాలపై 20 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
జూన్ 2న మండల కేంద్రంలో.. సోనియాగాంధీకి పాలాభిషేకం నిర్వహించనున్నారు. అంతేకాకుండా ఇదే నెలలో బీసీ గర్జన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ బీసీ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. బీసీ గర్జన పేరుతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని యోచిస్తోంది తెలంగాణ కాంగ్రెస పార్టీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం