పీఎం కేర్స్ ఫండ్ కింద సప్లయ్ అయిన వెంటిలేటర్లలో లోపాలు, మూలన పడి మూలుగుతున్న యంత్రాలు, పంజాబ్ లో చోద్యం !

పీఎం కేర్స్ ఫండ్ కింద సరఫరా అయిన వెంటిలేటర్లు లోపభూయిష్టంగా మారి మూలన పడిపోయాయి.గత ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఇచ్చిన ఇలాంటి ఎన్నో వెంటిలేటర్లు లోపాల కారణంగా వినియోగానికి నోచుకోకుండా ఉన్నాయి.

పీఎం కేర్స్ ఫండ్ కింద సప్లయ్ అయిన వెంటిలేటర్లలో లోపాలు, మూలన పడి మూలుగుతున్న యంత్రాలు, పంజాబ్ లో చోద్యం !
Ventilators Supplied Under
Umakanth Rao

| Edited By: Phani CH

May 12, 2021 | 7:23 PM

పీఎం కేర్స్ ఫండ్ కింద సరఫరా అయిన వెంటిలేటర్లు లోపభూయిష్టంగా మారి మూలన పడిపోయాయి.గత ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఇచ్చిన ఇలాంటి ఎన్నో వెంటిలేటర్లు లోపాల కారణంగా వినియోగానికి నోచుకోకుండా ఉన్నాయి. ఇవి అందిన కొన్ని గంటల్లోనే వీటి డొల్లతనం బయటపడింది. ఫరీద్ కోట్ లోని గురు గోవింద్ సింగ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి సప్లయ్ చేసిన 80 వెంటిలేటర్లలో 71 యంత్రాలు జస్ట్ ‘టాయ్ మెషిన్లుగా మారాయట. పీఎం కేర్స్ ఫండ్ కింద ఆగ్వా హెల్త్ కేర్ అనే సంస్థ వీటిని సమకూర్చింది. ఇవి అందిన ఒకటి రెండు గంటలకే సరిగా పని చేయడంలేదని గుర్తించామని, అందుకే మూలన పడేశామని ఈ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. ఇవి నాసిరకమైనవని, సాక్షాత్తూ పీఎం కేర్స్ ఫండ్ కింద వీటిని కేటాయించారంటే అమోఘంగా ఉంటాయని భావించామని వారు చెప్పారు.వీటిని కోవిడ్ రోగులకు వాడలేమని బాబా ఫరీద్ కోట్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వీసీ రాజ్ బహదూర్ చెప్పారు. తగినన్ని వెంటిలేటర్లు లభ్యం కాకపోవడంతో ఈ ఆసుపత్రి అధికారులకు ఏం చేయాలో తోచడం లేదు. హాస్పిటల్ లో సుమారు 300 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.

అయితే ఈ నాసిరకం వెంటిలేటర్ల మరమ్మతుకు పంజాబ్ చీఫ్ సెక్రటరీ నడుం బిగించారు. వీటిని బాగు చేసేందుకు టెక్నీషియన్లు రేపో,మాపో వస్తారని ఆయన చెప్పారు. కాగా 10 వెంటిలేటర్లను తెప్పిస్తామని పంజాబ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. పంజాబ్ రాష్ట్రంలో కూడా కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న విషయం గమనార్హం.

మరిన్ని ఇక్కడ చూడండి: AP Corona Cases Updates: ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. కొత్తగా 21వేలకు పైగా..

NTR Birthday: మే 20… యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు.. ఆ రోజున ఫ్యాన్స్ కు స్పెష‌ల్ ట్రీట్!

 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu