AP Corona Cases Updates: ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. కొత్తగా 21వేలకు పైగా..
AP Corona Cases Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ..
AP Corona Cases Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 90,750 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. వీరిలో 21,452 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారించారు. ఇక ఒక్క రోజులో 19,095 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం నాడు కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 13,44,386 పాజిటివ్ కేసులు నమోదు అవగా.. వీరిలో 11,38,028 కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,97,370 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,988 మంది ప్రాణాలు కోల్పోయారు.
జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతపురం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 2,185 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో 1,908, తూర్పుగోదావరి – 2,927, గుంటూరు – 1,836, కడప – 1,746, కృష్ణా – 997, కర్నూలు – 1,524, నెల్లూరు – 1,689, ప్రకాశం – 1,192, శ్రీకాకుళం – 1,285, విశాఖఫట్నం – 2,238, విజయనగరం – 693, పశ్చిమ గోదావరి – 1,232 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Also read: