NTR Birthday: మే 20… యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు.. ఆ రోజున ఫ్యాన్స్ కు స్పెష‌ల్ ట్రీట్!

మే 20... యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు పండుగ రోజు.. ఆ రోజు తారక్‌ పుట్టిన రోజు. అందుకే ట్రిపులార్‌ టీమ్‌తో పాటు కొరటాల శివతో చేస్తున్న సినిమా...

NTR Birthday: మే 20... యంగ్ టైగర్ ఎన్టీఆర్  పుట్టిన రోజు.. ఆ రోజున ఫ్యాన్స్ కు స్పెష‌ల్ ట్రీట్!
Ntr
Follow us
Ram Naramaneni

|

Updated on: May 12, 2021 | 7:14 PM

మే 20… యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు పండుగ రోజు.. ఆ రోజు తారక్‌ పుట్టిన రోజు. అందుకే ట్రిపులార్‌ టీమ్‌తో పాటు కొరటాల శివతో చేస్తున్న సినిమా నుంచి కూడా అప్‌డేట్‌ వస్తుందన్న ఆశతో ఉన్నారు నందమూరి ఫ్యాన్స్‌. అయితే కొరటాల మూవీ గురించి బజ్‌ లేకపోయినా జక్కన్న మాత్రం ఎన్టీఆర్‌ కోసం బిగ్ సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేస్తున్నారట. ఈ మధ్య రామ్‌ చరణ్‌ బర్త్ డే సందర్భంగా అల్లూరి సీతారామరాజు లుక్‌ రివీల్ చేశారు. సో… ఎన్టీఆర్‌ బర్త్‌ డే రోజు కొమురం భీమ్‌ లుక్‌ రిలీజ్‌ చేయటం పక్కా. అయితే అంతకు మించి మరో సర్‌ప్రైజ్‌ కూడా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఆ సర్‌ప్రైజ్‌ మరేంటో కాదు… ట్రిపులార్ నయా రిలీజ్ డేట్‌. యస్‌… అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ ఏడాది అక్టోబర్‌లో ట్రిపులార్‌ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సెకండ్‌ వేవ్‌ దెబ్బకు అది సాధ్యపడేలా లేదు.

దీంతో కొత్త రిలీజ్‌ డేట్‌ను తారక్‌ పోస్టర్‌తో పాటు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. మరి అక్టోబర్ మిస్ అయితే ట్రిపులార్ వచ్చేది ఎప్పుడూ.. ఈ విషయం తెలుసుకోవడానికి ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Also Read:  ఏడాదిలో ఎప్పుడైనా తిరుమ‌ల వెంక‌న్న దర్శనం.. ఆ టికెట్ ఉన్నవారికి మాత్రమే..!

క‌రోనాతో టాలీవుడ్ లో మ‌రో విషాదం.. ద‌ర్శ‌కుడు విన‌య్ కుమార్ క‌న్నుమూత‌