Rajasthan: మా ప్రభుత్వం పడిపోకుండా వసుంధర రాజే కాపాడారన్న అశోక్ గెహ్లట్.. స్పందించిన వసుంధర రాజే

2020లో రాజస్థాన్‌లో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అయితే దోల్‌పూర్‌లో ఆదివారం జరిగిన ఓ సభలో అశోక్ గెహ్లాట్ ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తన ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధర రాజే తనకు సహాయం చేశారని వెల్లడించారు.

Rajasthan: మా ప్రభుత్వం పడిపోకుండా వసుంధర రాజే కాపాడారన్న అశోక్ గెహ్లట్.. స్పందించిన వసుంధర రాజే
Vasundara Raje And Ashok Gehlot
Follow us
Aravind B

|

Updated on: May 08, 2023 | 10:19 AM

2020లో రాజస్థాన్‌లో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అయితే దోల్‌పూర్‌లో ఆదివారం జరిగిన ఓ సభలో అశోక్ గెహ్లాట్ ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తన ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధర రాజే తనకు సహాయం చేశారని వెల్లడించారు. కేంద్రమంత్రులైన అమిత్ షా, గజేంద్ర షేకావత్, ధర్మేంద్ర ప్రధాన్‌లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపించి తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. అయితే ఈ కుట్రకు వసుంధర రాజే మద్ధతు ఇవ్వకుండా తన ప్రభుత్వాన్ని కాపాడినట్లు పేర్కొన్నారు.

అయితే అశోర్ గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం మాజీ సీఎం వసుంధర రాజే స్పందించారు. గెహ్లట్ చేసిన ఆరోపణలన్ని అవాస్తవం అని స్పష్టం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను పెద్ద కుట్రగా పేర్కొన్నారు. ప్రస్తుతం తన సొంత పార్టీలోనే తిరుగుబాటు జరుగుతున్నందువల్ల ఇలాంటి ఆరోపణలు చేశారని తెలిపారు. రాజస్థాన్‌లో ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టే సంప్రదాయం లేదని వసుంధ రాజేతో పాటు మరో బీజేపీ నేత కైలాష్ మేగ్వాల్ అన్నారు. 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి కల్పిత కథలు అల్లుతున్నారని.. ఇది చాలా దురదృష్టకరమని.. ఇలా ఎన్ని మాయలు చేసినా విజయం సాధించలేరని వసుంధర రాజే అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లంచాలు ఇవ్వడం, తీసుకుంటే అది నేరంగా పరిగణించబడుతుందని.. ఒకవేళ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..