AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tourist: హోటల్‌లో రూం తీసుకున్న టూరిస్టు.. తన బెడ్ కింద ఉన్నదాని గురించి తెలుసుకుని షాక్

చైనాకు చెందిన ఏ పర్యాటకుడికి ఓ భయంకరమైన అనుభవం ఎదురైంది. తాను ఉన్న హటల్ రూంలోని బెడ్ కింద మృతదేహం ఉండటాన్ని తెలుసుకొని ఒక్కసారిగా కంగు తిన్నాడు. వివరాల్లోకి వెళ్తే చైనాకు చెందిన ఓ పర్యాటకుడు పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి టిబెట్‌కు వచ్చాడు.

Tourist: హోటల్‌లో రూం తీసుకున్న టూరిస్టు.. తన బెడ్ కింద ఉన్నదాని గురించి తెలుసుకుని షాక్
Tourist
Aravind B
|

Updated on: May 07, 2023 | 6:42 PM

Share

చైనాకు చెందిన ఏ పర్యాటకుడికి ఓ భయంకరమైన అనుభవం ఎదురైంది. తాను ఉన్న హటల్ రూంలోని బెడ్ కింద మృతదేహం ఉండటాన్ని తెలుసుకొని ఒక్కసారిగా కంగు తిన్నాడు. వివరాల్లోకి వెళ్తే చైనాకు చెందిన ఓ పర్యాటకుడు పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి టిబెట్‌కు వచ్చాడు. అక్కడే హోటల్‌లోని ఓ రూం తీసుకున్నాడు. కానీ తన రూంలో దుర్వాసన రావడాన్ని గమనించాడు. అయితే ఈ దుర్వాసన కింద ఉన్న బేకరీ నుంచి తన పాదాల వస్తుందేమోనని అనుకున్నాడు. దాదాపు సగం రోజు ఆ గదిలోని గడిపాడు. ఆ తర్వాత వేరే రూంకు మారాడు.

రెండు రోజుల తర్వాత అతనికి పోలీసులు ఫోన్ చేశారు. అతని బెడ్‌రూం కింద మృతదేహం ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఇది విన్న ఆ పర్యాటకుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు గత కొన్ని రోజులుగా ఓ మృతదేహం ఆ బెడ్ కింద ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో ఆ పర్యాటకుని తప్పు లేనందువల్ల అతడ్ని విడిచిపెట్టారు. దీంతో వెంటనే అతను టిబెట్‌ను వదిలి వెళ్లాడు. అయితే ఈ ఘటన వల్ల తాను ఇంకా షాక్ నుంచి బయటపడలేదని.. ఆ భయం వల్ల సరైన నిద్ర, మనశ్శాంతి కూడా లేకుండా పోయిందని ఆ పర్యాటకుడు తెలిపాడు. మరోవైపు ఈ కేసులో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు