Video: ప్లేయింగ్ 11లో నోఛాన్స్.. సబ్‌స్టిట్యూట్‌గా ఎంట్రీ.. కట్‌చేస్తే.. బౌండరీ లైన్‌లో స్టన్నింగ్ క్యాచ్‌తో షాకిచ్చాడు..
Prerak Mankad Stunning Catch Video: వృద్ధిమాన్ సాహా సెంచరీకి కేవలం 19 పరుగుల దూరంలో ఉన్నప్పుడు, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ ప్రేరక్ మన్కడ్ గుజరాత్ ఓపెనర్‌ను బౌండరీ వద్ద సంచలనాత్మక క్యాచ్‌తో కథ ముగించాడు.
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా అహ్మదాబాద్‌లో లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. అనుభవజ్ఞుడైన ఈ బ్యాట్స్‌మెన్ కేవలం 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి జట్టుకు షాకిచ్చాడు. సాహా బ్యాట్ నుంచి వచ్చిన షాట్లు లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లను దాదాపు అబ్బురపరిచాయి. సాహా మరింత బీభత్సం సృష్టించకముందే, అతని ఇన్నింగ్స్ సంచలనాత్మక క్యాచ్‌తో ముగిసింది. ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాని ఓ ఆటగాడు క్యాచ్ తీసుకున్నాడు.
ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ బ్యాట్స్‌మెన్ భీకరంగా చెలరేగిపోయారు. వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్ తుఫాన్ వేగంతో బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా సాహా రాగానే విరుచుకుపడటం మొదలుపెట్టాడు. ఫలితంగా పవర్‌ప్లేలోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. సాహాకు ఇది తొలి అర్ధ సెంచరీ.
క్యాచ్ కోసం చాలాసేపు పరుగు.. పడిపోయినా బాల్ వదల్లే..
సాహా దాడి కొనసాగుతూనే ఉంది. అతను తన సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. కానీ, అతని ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ముగిసింది. అవేష్ ఖాన్ వేసిన ఓవర్‌లోని మొదటి బంతిని డీప్ స్క్వేర్ లెగ్ వైపు ఆడాడు. ఆ బంతి చాలా ఎత్తులో ఎగరకపోయినా ఫైన్ లెగ్ బౌండరీ వద్ద ఉన్న ప్రేరక్ మన్కడ్ లాంగ్ రన్ చేసి బౌండరీకి కొన్ని అంగుళాల ముందు అద్భుతమైన క్యాచ్ పట్టాడు.
ఈ క్యాచ్‌కు కొద్దిసేపటి ముందు, మన్కడ్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి దిగాడు. సౌరాష్ట్ర ఆల్ రౌండర్ మన్కడ్‌కు ఈ సీజన్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. అతను లక్నో కోసం ఒక మ్యాచ్‌లో అవకాశం పొందాడు. కానీ, చివరిలో బౌలింగ్ లేదా బ్యాటింగ్ రాలేదు. అక్కడ అతనికి ఒక్క బంతి కూడా ఆడే అవకాశం రాలేదు. యాదృచ్చికమేమిటంటే ఆ మ్యాచ్ కూడా గుజరాత్‌పైనే కావడం గమనార్హం.
It was going to take something incredible to dismiss Saha today and Prerak Mankad provided it!
Rate this catch on 10!#IPLonJioCinema #GTvLSG #IPL2023 #TATAIPL pic.twitter.com/aBAa0qyXGD
— JioCinema (@JioCinema) May 7, 2023
గుజరాత్ తుఫాన్ బ్యాటింగ్..
గుజరాత్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడితే, వృద్ధిమాన్ సాహా, శుభ్‌మాన్ గిల్‌ల బలమైన ఇన్నింగ్స్‌ల ఆధారంగా, జట్టు 2 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. ఇది ఈ సీజన్ ఐపీఎల్‌లో అతిపెద్ద స్కోరుగా నిలిచింది. సాహా కేవలం 43 బంతుల్లో 81 పరుగులు చేయగా, గిల్ 51 బంతుల్లో 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా (25), డేవిడ్ మిల్లర్ (21) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..