దేశంలో బయటపడ్డ మరో లిక్కర్ కుంభకోణం.. రూ.2,000కోట్ల విలువైన స్కాంలో కీలక వ్యక్తి అరెస్ట్..
మద్యం సరఫరా కంపెనీల నుంచి కేస్‌పై రూ.75 నుంచి రూ.150 వరకు కమిషన్ వసూలు చేసేవాడు. ప్రైవేటుగా నకిలీ మద్యం తయారు చేసి ప్రభుత్వ దుకాణాల్లో వాటిని విక్రయించి 30 నుంచి 40 శాతం కమిషన్ పొందాడని ఈడీ ఆరోపించింది. ఈ విధంగా 2019 నుంచి..
దేశంలో మరో లిక్కర్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంలో భారీ అవినీతి బట్ట బయలైనట్టు ఎన్ ఫోర్స్ మెంట్ ఈడీ ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కాంగ్రెస్ నేత సోదరుడు, సీనియర్ ఐఏఎస్ అధికారితో కలిసి మద్యం అక్రమాలకు పాల్పడినట్టుగా ఈడీ ఆరోపించింది. వీరు ఏకంగా రూ.2వేల కోట్ల అవినీతిని గుర్తించినట్టు వెల్లడించింది. లిక్కర్ స్కాంలో కాంగ్రెస్ నేత, రాయ్ పూర్ మేయర్ ఐజాజ్ ధేబర్ సోదరుడు అన్వర్ ధేబర్ ను ఈడీ మే 6న అరెస్టు చేసింది. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించింది. వీరిద్దరూ అక్రమంగా వసూలు చేసిన సొమ్మును రాష్ట్రంలో ఎన్నికల ఖర్చుకు కూడా వినియోగించారు. దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించడంతో రానున్న రోజుల్లో ఈ స్కాంలో మరికొంత మంది రాజకీయ నేతల పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
చత్తీస్‌గఢ్ లోని ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తోంది. షాపుల నిర్వహణ, నగదు వసూలు, బాటిల్ తయారీ, హాలోగ్రామ్ తయారీ కోసం 20స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్లు పిలుస్తోంది. ఈ ప్రక్రియలో కొంతమంది అధికారుల సహకారంతో బాటిల్ తయారీ నుంచి మద్యం అమ్మకాల వరకు అన్వర్ తన అధీనం లోకి తెచ్చుకున్నాడని ఈడీ వెల్లడించింది. మద్యం సరఫరా కంపెనీల నుంచి కేస్‌పై రూ.75 నుంచి రూ.150 వరకు కమిషన్ వసూలు చేసేవాడు. ప్రైవేటుగా నకిలీ మద్యం తయారు చేసి ప్రభుత్వ దుకాణాల్లో వాటిని విక్రయించి 30 నుంచి 40 శాతం కమిషన్ పొందాడని ఈడీ ఆరోపించింది. ఈ విధంగా 2019 నుంచి 2022 వరకు సుమారు రూ. 1200 కోట్లు నుంచి రూ. 1500 కోట్లు అక్రమంగా సంపాదించాడని ఈడీ గుర్తించింది. 2022లో ఐఎఎస్ అధికారి అనిల్ తుటేజా పై ఐటీ శాఖ దాడులతో ఈ స్కామ్ బయటపడింది.
ఐజాజ్ ధేబర్, ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ మాజీ మేయర్. ఆయన కాంగ్రెస్ సర్కిల్‌లో గుర్తింపు పొందారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపుతున్నారు. అయితే, ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అన్వర్‌ను హాజరుకావాలని చాలాసార్లు ఈడీ నోటీసులు జారీ చేసినా.. అతడు తప్పించుకు తిరుగుతున్నాడు. ఆయన రాయ్‌పూర్ హోటల్‌లో ఉన్నారనే సమాచారం మేరకు శనివారం అధికారులు సోదాలు చేశారు. వెనుక డోర్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అన్వర్‌ను అరెస్టు చేశారు. అతనిపై మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..