Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూతల స్వర్గం లడఖ్‌ ఆకాశంలో అరుదైన అద్భుత దృశ్యం…ఆరోరాస్‌ లైట్లుగా చెబుతున్న శాస్త్రవేత్తలు..!

లడఖ్‌లోని చాంగ్‌తంగ్‌లో రాత్రిపూట ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతోంది. ‘అరోరా రాత్రిపూట సాధారణం కంటే తక్కువ అక్షాంశాలకు చేరుకుంది.. ఇది యూరప్, చైనా, భారత్‌లోని లడఖ్ నుంచి అరుదైన వీక్షణకు దారితీసింది’ అని ఐఐఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వగీష్ మిశ్రా అన్నారు.

భూతల స్వర్గం లడఖ్‌ ఆకాశంలో అరుదైన అద్భుత దృశ్యం...ఆరోరాస్‌ లైట్లుగా చెబుతున్న శాస్త్రవేత్తలు..!
Aurora
Follow us
Jyothi Gadda

|

Updated on: May 08, 2023 | 9:45 AM

భూతల స్వర్గం మన లడఖ్. అలాంటి లడఖ్‌ ఆకాశంలో ఎప్పుడూ చూడని అద్భుతం, మిస్టిరీయస్‌ సంఘటన అందరినీ ఆశ్చర్యంలో పడేసింది.. లడఖ్ ఆకాశంలో రంగురంగుల వలయాలు, సముద్రపు అలల మాదిరిగా కనిపించి చూపరులను ఆకట్టుకున్నాయి. వీటిని ఆరోరాస్ అని అంటారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఏప్రిల్ 23 నుండి 24 వరకు లడఖ్‌లోని హాన్లే అబ్జర్వేటరీలో తన కెమెరాతో ప్రత్యేక పద్ధతిలో ఆ అద్భుతాన్ని బంధించింది. ప్రస్తుతం ఈ సంఘటన శాస్త్రవేత్తలకు ఉత్కంఠగా మారింది. భూ అయస్కాంత తుఫాను భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని తాకి, ప్రత్యేకమైన అరోరాలను సృష్టించింది. ఇవి లడఖ్ లోని సరస్వతి పర్వతంపై రంగుల వలయాలు ఏర్పడ్డాయి. భారత దేశంలో మొదటిసారి ఇలా జరిగింది.

అలస్కా, నార్వే, ఇతర దేశాలలో అరోరాస్ సాధారణంగా ఎత్తైన ప్రదేశాలలో ఇలాంటి ఆరోరాస్‌ కనిపిస్తాయి. ఇప్పుడు లడఖ్ లో కనిపించాయి. భారత ఖగోళ అబ్జర్వేటరీ ద్వారా భారతదేశంలో అరోరా కెమెరాలో బంధించడం ఇదే మొదటిసారి. లడఖ్ హన్లేలోని IAO పైన ఉన్న 360-డిగ్రీల కెమెరా ఇలాంటి మిస్టిరీయస్‌ దృశ్యాన్ని సంగ్రహించింది, ఇది సూర్యుడు, భూమి అయస్కాంత క్షేత్రం ద్వారా విసిరిన ప్లాస్మా కణాల మధ్య పరస్పర చర్య ద్వారా ప్రేరేపించబడింది. “భూమిని తాకిన తీవ్రమైన భూ అయస్కాంత తుఫాను కారణంగా అరోరా లైట్లు కనిపించాయి. ఇంత తక్కువ అక్షాంశంలో అరోరాను చూడటం చాలా అరుదు” అని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

500 మీటర్ల ఎత్తులో సరస్వతి పర్వతంపై ఏర్పాటుచేసిన కెమెరాలు బంధించిన ఫోటోలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ విడుదల చేసింది. టైమ్‌లాప్స్ వీడియో లడఖ్‌లోని చాంగ్‌తంగ్‌లో రాత్రిపూట ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతోంది. ‘అరోరా రాత్రిపూట సాధారణం కంటే తక్కువ అక్షాంశాలకు చేరుకుంది.. ఇది యూరప్, చైనా, భారత్‌లోని లడఖ్ నుంచి అరుదైన వీక్షణకు దారితీసింది’ అని ఐఐఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వగీష్ మిశ్రా అన్నారు.

కెనడాలోని చర్చిల్ నగరంలో ప్రతి రాత్రి ప్రజలు ఇలాంటి సహజ దృశ్యాన్ని చూస్తున్నారు. ఈ దృశ్యం చాలా అందంగా ఉంది. దీనిని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. అలాంటి దృశ్యం ఏడాదికి ఒకటి రెండు సార్లు మాత్రమే కాదు, మొత్తం 300 రోజుల పాటు కనిపించడమే గొప్ప విషయం.

అరోరా అత్యంత సాధారణ రంగు ఆకుపచ్చ. భూమికి 60 మైళ్ల ఎత్తులో ఉన్న ఆక్సిజన్ అణువులు చార్జ్డ్ కణాలతో చర్య జరిపినప్పుడు ఇది ఏర్పడుతుంది. నైట్రోజన్‌తో చర్య జరిపినప్పుడు మనకు నీలం, వైలెట్ రంగులు కనిపిస్తాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..