- Telugu News Photo Gallery Technology photos JIO Launches Jio dive VR Headset have a look on features and price details
Jio Dive VR headset: ఇంట్లోనే స్టేడియంలో క్రికెట్ చూసిన మజా.. జియో నుంచి అదిరిపోయే వీఆర్ హెడ్‌సెట్
ఐపీఎల్ క్రికెట్లను వీక్షిస్తున్న యూజర్ల కోసం జియో అదిరిపోయే ఓ ప్రొడక్ట్‌ను తీసుకొచ్చింది. జియో డైవ్ వీర్ హెడ్‌సెట్ పేరుతో తీసుకొచ్చిన ఈ హెడ్ సెట్‌తో యూజర్లకు రియల్ టైమ్‌లో క్రికెట్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంతకి ఈ వీఆర్ హెడ్‌సెట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: May 08, 2023 | 9:27 AM

ఐపీఎల్ మ్యాచ్ వీక్షించే వారికి జియో అదిరిపోయే ఓ ప్రొడక్ట్‌ను తీసుకొచ్చింది. ఐపీఎల్ 2023 వర్చువల్ రియాలిటీలో ఎంజాయ్ చేసేందుకు జియో డైవ్ అనే కొత్త వీఆర్ హెడ్‌సెట్‌ను జియో లంచ్ చేసింది. జియో సినిమా యాప్‌లో ఐపీఎల్‌ని ఆన్‌లైన్‌లో చూస్తున్న వారు వీఆర్ హెడ్‌సెట్‌ని ఉపయోగించి చూడవచ్చు.

వంద అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీ వీక్షణ వంటి ఫీచర్లు ఉన్నాయి. వంద అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీ వీక్షణ వంటి ఫీచర్లున్నాయి. ధర విషయానికొస్తే.. ఈ జియో డ్రైవ్ హెడ్ సెట్ రూ.1299లకు లభిస్తుంది. పేటీఎం వ్యాలెట్ ద్వారా కొనే వారికి రూ.500 క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది.

ఆండ్రాయిడ్ ఐఓఎస్-15 వెర్షన్‌తోపాటు ఆపై ఓఎస్ వెర్షన్‌తో పని చేసే స్మార్ట్ ఫోన్లలోనూ ఇది పని చేస్తుంది. ఈ డివైజ్‌లో ఇన్‌సర్ట్ చేసే ఫోన్ సైజ్ 6.7 ఇంచెస్‌ను మించరాదు. ఫోన్‌లో గైరోస్కోప్, యాక్సెలెరో మీటర్ కూడా తప్పనిసరిగా ఉండాలి.

ఈ హెడ్ సెట్ ఉపయోగించే వారు తప్పనిసరిగా జియో ఇమ్మర్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. జియో నెట్‌వర్క్ ఉపయోగించే వారు మాత్రమే ఈ డివైజ్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ముందుగా జియో డైవ్‌ను ఎంచుకుని, వాచ్ ఆన్ డైవ్ పై నొక్కాలి. జియో డైవ్‌లో ఫోన్ సపోర్ట్ క్లిప్, లెన్స్‌ల మధ్య ఫోన్‌ను ఉంచడానికి ముందు కవర్‌ని తెరవాలి. డివైజ్ ఉన్న బటన్స్ ఆధారంగా వీడియోను జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు.





























