Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టుల మృతి.. మృతుల్లో ఎల్‌ఓఎస్ కమాండర్‌తోపాటు మహిళ కమాండర్..

దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. సోమవారం ఉదయం పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతో సహా ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు అధికారి ఒకరు తెలిపారు.

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టుల మృతి.. మృతుల్లో ఎల్‌ఓఎస్ కమాండర్‌తోపాటు మహిళ కమాండర్..
Maoists
Follow us
Sanjay Kasula

|

Updated on: May 08, 2023 | 11:07 AM

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. సోమవారం ఉదయం పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతో సహా ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు అధికారి ఒకరు తెలిపారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి పేలుడు పదార్ధాల నిల్వ, ఆటోమేటిక్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. మృతి చెందిన ఇద్దరు మావోయిస్టులు తమ తలపై రూ. 11 లక్షల రివార్డు ఉంది. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్‌పురం గ్రామ సమీపంలోని అడవిలో ఉదయం 5.30 గంటలకు జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం కూంబింగ్ ఆపరేషన్‌లో నిర్వహిస్తుండగా.. పోలీసులపైకి మావోయిస్టుల కాల్పులు మొదలు పెట్టారని పోలీసు సూపరింటెండెంట్ సునీల్ శర్మ తెలిపారు.

గొలపల్లి లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్ (ఎల్‌ఓఎస్) మావోయిస్టు కమాండర్ మడ్కం ఎర్రతో పాటు 30-35 మంది టీమ్ సభ్యులు ఉన్నట్లు పోలీసులకు నిర్దిష్ట సమాచారం అందింది. అందువల్ల, డిఆర్‌జి, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్), దాని ఎలైట్ యూనిట్ కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) ప్రత్యేక బృందాలు ఆదివారం రాత్రి ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు.

అటువైపు నుంచి తుపాకులు నిశ్శబ్దం ఆగిపోయిన తరువాత సెర్చ్ నిర్వహించారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లుగా పోలీసులు తెలిపారు. వారిని ఎల్‌ఓఎస్ కమాండర్ ఎర్రా, అదే స్క్వాడ్ డిప్యూటీ కమాండర్ పొడియం భీమే అనే మహిళా కేడర్‌గా గుర్తించామని శర్మ తెలిపారు. ఎర్రా, భీమే వారి తలపై వరుసగా రూ. 8 లక్షలు, రూ. 3 లక్షల రివార్డులను కలిగి ఉన్నారని అధికారి తెలిపారు.

ఇదిలావుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం

పెళ్లి పీటలపై వధువు స్థానంలో ఆమె తల్లి..షాకైన పెళ్లికొడుకు తర్వాత
పెళ్లి పీటలపై వధువు స్థానంలో ఆమె తల్లి..షాకైన పెళ్లికొడుకు తర్వాత
వామ్మో.. బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాలు వీడియో
వామ్మో.. బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాలు వీడియో
రథోత్సవంలో అపశృతి.. కూలిన పై కప్పు ఏం జరిగిందంటే? వీడియో
రథోత్సవంలో అపశృతి.. కూలిన పై కప్పు ఏం జరిగిందంటే? వీడియో
అన్నవరం క్షేత్రంలో యువతికి ఇష్టం లేని పెళ్లి.. చివరకు వీడియో
అన్నవరం క్షేత్రంలో యువతికి ఇష్టం లేని పెళ్లి.. చివరకు వీడియో
రేపు ఆకాశంలో అద్భుతం.. మిస్ కాకుండా చూడండి వీడియో
రేపు ఆకాశంలో అద్భుతం.. మిస్ కాకుండా చూడండి వీడియో
పుష్ప2 సినిమాకు డ్యాన్స్ అదర గొట్టిన మాజీసీఎం వీడియో
పుష్ప2 సినిమాకు డ్యాన్స్ అదర గొట్టిన మాజీసీఎం వీడియో
నడి రోడ్డుపై పోలీస్ చేసిన పనికి అంతా షాక్ వీడియో
నడి రోడ్డుపై పోలీస్ చేసిన పనికి అంతా షాక్ వీడియో
అందుకే చంపేస్తున్నాం అన్నారు.. చంద్రమౌళి స్నేహితులు ఏం చెప్పారంటే
అందుకే చంపేస్తున్నాం అన్నారు.. చంద్రమౌళి స్నేహితులు ఏం చెప్పారంటే
ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా
ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా
పెరుగులో ఒక్క చెంచా దీన్ని కలిపి తినండి.. అద్భుతాలు చూడండి
పెరుగులో ఒక్క చెంచా దీన్ని కలిపి తినండి.. అద్భుతాలు చూడండి