వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ గడువు పెంపు..

Validity Of Driving Licence: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్ల..

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ గడువు పెంపు..
Vehicles
Ravi Kiran

|

Jun 17, 2021 | 1:28 PM

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్ల గడువును ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ డెడ్‌లైన్ జూన్ 30 దాకా ఉండగా.. కరోనా నేపధ్యంలో దాన్ని కాస్తా పొడిగించింది.

“COVID-19 వ్యాప్తిని నివారించాల్సిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఫిట్‌నెస్, పర్మిట్(అన్ని రకాల), లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేదా ఏదైనా ఇతర సంబంధిత డాక్యుమెంట్స్ చెల్లుబాటును సెప్టెంబర్ 30 వరకు పొడిగించాం” అని పేర్కొంటూ కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.

ఇదిలా ఉంటే డ్రైవర్ శిక్షణా కేంద్రాలకు సంబంధించిన నిబంధనలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ జారీలో కేంద్ర రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖ కొన్ని మార్పులు చేసింది. అంతకుముందు, అభ్యర్థులు లైసెన్స్ పొందేందుకు డ్రైవింగ్ టెస్టులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉండేది. అయితే తాజాగా రవాణా మంత్రిత్వ శాఖ గైడ్‌లైన్స్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వం పరిగణనలో నడిచే శిక్షణా కేంద్రాల్లో ట్రైనింగ్ పూర్తి చేస్తే డ్రైవింగ్ టెస్టు లేకుండానే లైసెన్స్ జారీ చేయనున్నారు. దీని ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది.

కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ట్వీట్..

Also Read:

గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టె.. అందులో ఎర్రని వస్త్రంలో చిన్నారి.! ఎక్కడ నుంచి వచ్చిందంటే.!

మీ బ్యాంక్ ఖాతాలోకి ఎల్‌పీజీ సబ్సిడీ డబ్బు రాలేదా.? ఫిర్యాదు చేయండిలా.! వివరాలివే..

 పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ సౌకర్యాన్ని ఉద్యోగం కోల్పోయినా పొందొచ్చు.!

కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్ సంకేతాలు.. జూన్ 20 నుంచి మరిన్ని సడలింపులు..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu