జై శ్రీరామ్ నినాదాన్ని వాట్సాప్ లో షేర్ చేసుకున్నందుకు….ఎన్ ఎస్ యూఐ సభ్యుల సస్పెన్షన్…
జైశ్రీరామ్ నినాదాన్ని వాట్సాప్ లో షేర్ చేసుకున్నందుకు ఝార్ఖండ్ నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా కి చెందిన ఏడుగురు సభ్యులను ఆ విభాగం అధ్యక్షురాలు సస్పెండ్ చేశారు. వీరికి ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూపు ఉంది. తూర్పు సింగ్ భమ్ జిల్లా కమిటీకి చెందిన...
జైశ్రీరామ్ నినాదాన్ని వాట్సాప్ లో షేర్ చేసుకున్నందుకు ఝార్ఖండ్ నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా కి చెందిన ఏడుగురు సభ్యులను ఆ విభాగం అధ్యక్షురాలు సస్పెండ్ చేశారు. వీరికి ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూపు ఉంది. తూర్పు సింగ్ భమ్ జిల్లా కమిటీకి చెందిన వీరిని మూడేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్టు ఈ శాఖ అధ్యక్షురాలు రోజ్ తిర్కే తెలిపారు. ఈ గ్రూప్ లో మీరు ఉండాలనుకుంటే ఇలాంటి =నినాదాలను ఇందులో పేర్కొనవద్దని ఆమె ఆదేశాలు జారీ చేశారని సస్పెన్షన్ కి గురైన వారు తెలిపారు. తామిలా ఈ స్లోగన్ తో గ్రీట్ చేసుకోవడం తప్పా అని ప్రశ్నించారు. ఇది వల్గర్ అవుతుందా అన్నారు. తమ నిరసనను పార్టీ హైకమాండ్ కు, రాష్ట్ర శాఖ అధ్యక్షునికి కూడా తెలియజేస్తామన్నారు. అయితే ఇది బీజేపీ నేతలవరకు వెళ్ళింది. జైశ్రీరామ్ అని నినదించడం తప్పు కాదని, వీరిని సస్పెండ్ చేస్తూ మీరు తీసుకున్న చర్య మీది హిందూ వ్యతిరేక పార్టీ అని స్ఫష్టంగా నిరూపిస్తోందని వారన్నారు. దీనిపై ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
అయితే తమ చర్యను రోజ్ తిర్కే సమర్థించుకున్నారు. వీరు సంస్థ నాయకత్వానికి వ్యతిరేకంగా వర్గ పోరాటాన్ని ప్రారంభించారని, ఈ నినాదం ముసుగులో సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ గానీ..ఎన్ ఎస్ యూ ఐ గానీ ఓ ప్రత్యేక మతం పట్ల ఆసక్తి చూపదని, తమకు అన్ని మతాలూ ఒక్కటేనని అన్నారు. కాగా తమ శాఖ అధ్యక్షురాలు తీసుకున్న చర్యను తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని సస్పెన్షన్ కి గురైన సభ్యులు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టెలో చిన్నారి.!మహాభారతం నాటి సీన్ మళ్లీ రిపీట్..వైరల్ అవుతున్న వీడియో :viral video.