వ్యాక్సిన్ తీసుకున్నా, తీసుకోకపోయినా మాస్క్ ధారణ, భౌతిక దూరం పాటింపు తప్పనిసరి, కేంద్ర నిపుణుడు విజయ్ రాఘవన్ క్లారిటీ
దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతూ వ్యాక్సిన్ కోసం రోజూ వందలు, వేలాది ప్రజలు గంటలతరబడి నిరీక్షిస్తుంటే అసలు టీకామందు అవసరం లేదన్నట్టు కొందరు నిపుణులు చెబుతున్నారు.
దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతూ వ్యాక్సిన్ కోసం రోజూ వందలు, వేలాది ప్రజలు గంటలతరబడి నిరీక్షిస్తుంటే అసలు టీకామందు అవసరం లేదన్నట్టు కొందరు నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నా, లేకున్నా మాస్క్ తప్పనిసరి అని, భౌతిక దూరం కూడా పాటిస్తే మరీ మంచిదని ఆయన అంటున్నాడు. కేంద్రానికి ప్రిన్సిపల్ అడ్వైజర్ అయిన కె.విజయ్ రాఘవన్ చెబుతున్న సరికొత్త మాట ఇది..మొదట కోవిడ్ నేపథ్యంలో మన ప్రవర్తనను (బిహేవియర్ ని) మనకు మనం అవగాహన చేసుకోవాలని, కానీ ‘రాజీ పడే’ ధోరణి తగదని ఆయన పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలంటే. మొదట మన ప్రవర్తనను మార్చుకోవాలి, వ్యాక్సిన్ వేయించుకున్నామా, లేదా అన్నది ముఖ్యం కాదు.. భౌతిక దూరంతో పాటింపు మాస్క్ ధారణ చాలా ఇంపార్టెంట్ అని ఈయన వెల్లడించారు. హెల్త్ కేర్ సిస్టంపై ఒత్తిడిని తగ్గించాలంటే మనం మారాలి.. నిర్లక్ష్య ధోరణిని విడనాడాలి అని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో దేశంలో మూడో దశ కోవిద్ అనివార్యమని విజయ్ రాఘవన్ ఈ నెల 5 నే చెప్పారు.అయితే ఏ సమయంలో ఇది ప్రారంభమవుతుందన్నది చెప్పలేమని, ఈ వైరస్ పరిస్థితి చూస్తే మాత్రం థర్డ్ వేవ్ తప్పనిసరి అని ఆయన ఆ నాడే వ్యాఖ్యానించారు.దానికి అంతా సిధ్ధపడి ఉండాలన్నారు.
అసలే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి విరామ కాలాన్ని మొదట 6 నుంచి 8 వారాలకు, ఆ తరువాత తాజాగా 12 నుంచి 16 వారాలకు పెంచాలన్న సిఫారసులు అయోమయంలో పడేస్తుంటే..ఈ వైద్య నిపుణుడు అసలు వ్యాక్సిన్ తీసుకున్నా, తీసుకోకపోయినా ఫరవాలేదని చెప్పడం ప్రజలను మరింత గందరగోళానికి గురి చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 4,298 కరోనా కేసులు, 32 మరణాలు
బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా నటించాలంటే కొంచెం భయమేసింది.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్..