తొలి కోవిడ్ అనంతరం ప్రజల నిర్లక్ష్యమే ఈ పాండమిక్ కి కారణం, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్య, ఇప్పటికైనా మేల్కొందామని పిలుపు
తొలి కోవిడ్ తరువాత ప్రజలు, ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహించిన కారణంగానే ఇప్పుడీ సెకండ్ వేవ్ పరిస్థితికి కారణమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.
తొలి కోవిడ్ తరువాత ప్రజలు, ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహించిన కారణంగానే ఇప్పుడీ సెకండ్ వేవ్ పరిస్థితికి కారణమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని వర్గాల నిర్లక్ష్య ఫలితమే ఇది అన్నారు. ‘పాజిటివిటీ అన్ లిమిటెడ్’ పేరిట బీజేపీ, ఆర్ఎస్ఎస్నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మొదటి వేవ్ అనంతరం ప్రజలు, ప్రభుత్వాలు, అధికారులు కూడా చాలా నెగ్లిజెంట్ గా ఉన్నామని, డాక్టర్లు హెచ్చరించినా పట్టించుకోలేదని అన్నారు. ఇప్పటికీ మనం అలాగే వ్యవహరిస్తున్నామన్నారు.ఇప్పుడు మూడో దశ వస్తుందని అంటున్నారని, దీనికి మనం భయపడాలా లేక ఎదుర్కోవాలా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై పోరాటం జరిపి విజయం సాధించాల్సి ఉందన్నారు. కనీసం ఇప్పుడైనా ఈ అనుభవాల నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలని, థర్డ్ వేవ్ ముప్పును అంతా కలిసి ఎదుర్కొందామని ఆయన చెప్పారు. నిరాశా వాదానికి చోటే లేదని, ఓటమి అన్నది అర్థరహితమని బ్రిటన్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ గతంలోనే చేసిన వ్యాఖ్యలను మోహన్ భగవత్ గుర్తు చేశారు. మన భారతీయులు ఈ పాండమిక్ పై పూర్తి విజయం సాధిస్తారని తనకు నమ్మకం ఉందన్నారు.
జీవన్మరణాలు కొనసాగుతూనే ఉంటాయి.. కానీ ఇవి మనల్ని భయపెట్టజాలవు..ఈ గుణపాఠాలు భవిష్యత్తులో మనకు మేలే చేస్తాయి అని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ పై ప్రజల్లో అవగాహనను, వారిలో మనోస్థైర్యాన్ని పెంచేందుకు ఆర్ఎస్ఎస్ కోవిద్ రెస్పాన్స్ టీమ్ ఈ ప్రసంగ కార్యక్రమాలను ఈ నెల 11 నుంచి నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల్లో విప్రో గ్రూప్ ఫౌండర్ అజీమ్ ప్రేమ్ జీ, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Shocking Corona Counts: అన్ని దేశాలదీ అదే దారి..కరోనా లెక్కలన్నీ బోగస్..వాస్తవ లెక్కలు ఇవే..తేల్చి చెప్పిన నిపుణులు!
ATM: ఇండియా వన్ ఏటీఎమ్‌లో రూ. 100 ఎంటర్ చేస్తే రూ. 500.. ఎగబడ్డ ఖాతాదారులు.. కారణమేంటంటే..