Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 4,298 కరోనా కేసులు, 32 మరణాలు
తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 64,362 శాంపిల్స్ టెస్ట్ చేయగా 4,298 కరోనా కేసులు వెలుగుచూశాయి....
తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 64,362 శాంపిల్స్ టెస్ట్ చేయగా 4,298 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,25,007కి చేరింది. మరో 32 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచినట్లు వైద్యారోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ లో తెలిపింది. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 2,928కి చేరింది. కొత్తగా వైరస్ నుంచి మరో 6,026 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 53,072 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 601మంది కరోనా బారినపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 267, మేడ్చల్ మల్కాజిగిరి 368 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
దేశంలో వ్యాక్సినేషన్ వివరాలు….
దేశంలోని 10 రాష్ట్రాల్లో 67శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు మోదీ సర్కార్ వెల్లడించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. 60ఏళ్లు పైబడిన వారిలో 39.9శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు వివరించింది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసువారిలో 45.5శాతం మందికి; 30 నుంచి 45 ఏళ్ల వారిలో 9.4శాతం; 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కుల్లో 5.2శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది. 18 నుంచి 44 ఏళ్ల వారిలో 42లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొంది. కాగా ఏపీలో 18 నుంచి 44 వారిలో 2624మందికి వ్యాక్సిన్ ఇవ్వగా.. తెలంగాణలో ఆ సంఖ్య 500గా ఉన్నట్టు తెలిపింది.
Also Read: కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను..