తాత్కాలికంగా నిలిచిన కేదార్‌నాథ్ యాత్ర
కేదార్‌నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలో పలు మార్గాల్లో కొండచరియలు..

కేదార్‌నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలో పలు మార్గాల్లో కొండచరియలు విరిగిపడుతుండటంతో.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాదు.. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రప్రయాగ జిల్లాలోని బిరీ,బన్స్‌వారా ప్రాంతంలో మీదుగా కేదార్‌నాథ్ వెళ్లే దారులు మూతపడ్డాయని ఉత్తరాఖండ్ సీఎంవో తెలిపింది. ఫతా గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో ఓ షాపు ధ్వంసమైందని.. అంతేకాకుండా అనేక భవనాలు ప్రమాదంలో పడ్డాయని తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నామని.. కొండచరియలను తొలగించి రాకపోకలకు రూట్ క్లియర్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో.. ప్రస్తుతం ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read More :
దేశరాజధానిలో భారీ వర్షం.. గోడ కూలి కార్లు ధ్వంసం