త్రిపురలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్
త్రిపురలో భారీగా డ్ర్గగ్స్ పట్టుబడ్డాయి. త్రిపుర పోలీసు విభాగంలోని యాంటీ నార్కోటిక్ టీం జరిపిన దాడుల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ ఉన్నాయన్న పక్కా సమాచారం అందడంతో.. త్రిపుర..
త్రిపురలో భారీగా డ్ర్గగ్స్ పట్టుబడ్డాయి. త్రిపుర పోలీసు విభాగంలోని యాంటీ నార్కోటిక్ టీం జరిపిన దాడుల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ ఉన్నాయన్న పక్కా సమాచారం అందడంతో.. త్రిపుర రాజధాని అగర్తలోని శాంతిపర ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో పెద్ద ఎత్తున యాబా టాబ్లెట్లు, హెరాయిన్ ప్యాకెట్లను గుర్తించారు. అంతేకాదు. రూ.13 లక్షల క్యాష్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇంకా తనిఖీలు చేపడుతున్నామని.. పట్టుబడ్డ వ్యక్తిని విచారణ చేపడుతున్నామన్నారు. కాగా, గత కొద్ది రోజులుగా అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు డ్రగ్స్ దందాపై ప్రత్యేక దృష్టిసారించారు.
Anti-Narcotics Unit of Tripura police has seized a huge quantity of drugs, consisting of Yaba tablets & heroin from a house in Santipara in the capital Agartala. Around Rs 13 lakhs cash recovered & one person arrested so far. Seizure operation is still continuing: Tripura Police pic.twitter.com/mvClwXXLgG
— ANI (@ANI) August 19, 2020
Read More :