AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ORRపై ఘోర ప్రమాదం.. చెట్లకు నీళ్లు పోస్తుండగా దూసుకొచ్చిన మృత్యువు.. ఇద్దరు మృతి!

హైదరాబాద్‌ శివారులోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా కొల్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు డివైడర్‌ మధ్యలో ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్‌ ట్యాంకర్‌ను వేగంగా వచ్చిన అశోక్‌ లేలాండ్‌ వాహనం బలంగా ఢీకొట్టడంతో ఈ విషాదం సంభవించింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

ORRపై ఘోర ప్రమాదం.. చెట్లకు నీళ్లు పోస్తుండగా దూసుకొచ్చిన మృత్యువు.. ఇద్దరు మృతి!
Tragic Accident On Hyderabad Orr
Balaraju Goud
|

Updated on: Oct 25, 2026 | 4:50 PM

Share

హైదరాబాద్‌ శివారులోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా కొల్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు డివైడర్‌ మధ్యలో ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్‌ ట్యాంకర్‌ను వేగంగా వచ్చిన అశోక్‌ లేలాండ్‌ వాహనం బలంగా ఢీకొట్టడంతో ఈ విషాదం సంభవించింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

చెట్లకు నీళ్లు పోస్తుండగా ఢీకొన్న వాహనం

అందిన సమాచారం ప్రకారం.. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఎగ్జిట్‌ సమీపంలో డివైడర్‌ మధ్యలో ఉన్న చెట్లకు వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా నీళ్లు పోస్తున్నారు. అదే సమయంలో అటువైపుగా వేగంగా వచ్చిన అశోక్‌ లేలాండ్‌ వాహనం ట్యాంకర్‌ను బలగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో అశోక్‌ లేలాండ్‌ వాహనం ముందు క్యాబిన్‌లో కూర్చున్న డ్రైవర్‌ లోపల ఇరుక్కుపోయాడు. అతడికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చెట్లకు నీళ్లు పోస్తున్న మరో వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఆసుపత్రికి మృతదేహాల తరలింపు

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అవసరమైన చర్యలు చేపట్టారు. మృతదేహాలను పఠాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగింది? వాహనం వేగమే కారణమా? డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కొల్లూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు, ఇతర పరిస్థితులపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని, రహదారిపై పనులు జరుగుతున్న ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. ముఖ్యంగా ఎగ్జిట్‌లు, డివైడర్ల సమీపంలో వాహనాలు నడిపేటప్పుడు ముందున్న పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తగా ప్రయాణించడం అత్యవసరం.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us