AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Minister Dinesh Khatik: డిపార్ట్‌మెంట్ అధికారులు మాట వినడం లేదు.. యూపీ మంత్రి దినేశ్ ఖతిక్ రాజీనామా

UP Minister Dinesh Khatik Resigns: దళితుడిని కావడంతో.. డిపార్ట్‌మెంటల్ అధికారులు తన మాట వినడం లేదని ఆరోపిస్తూ ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు.

UP Minister Dinesh Khatik: డిపార్ట్‌మెంట్ అధికారులు మాట వినడం లేదు.. యూపీ మంత్రి దినేశ్ ఖతిక్ రాజీనామా
Dinesh Khatik
Shaik Madar Saheb
|

Updated on: Jul 20, 2022 | 4:13 PM

Share

UP Minister Dinesh Khatik Resigns: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బుధవారం జలశక్తి శాఖ మంత్రి దినేశ్‌ ఖతిక్ రాజీనామా తీవ్ర సంచలనం రేపింది. దళితుడిని కావడంతో.. డిపార్ట్‌మెంటల్ అధికారులు తన మాట వినడం లేదని ఆరోపిస్తూ ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. దినేశ్‌ బాటలో మరో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నట్టు సమాచారం. తమ శాఖలకు ఇతర మంత్రులకు బదిలీ చేయడంపై మంత్రి జితిన్‌ ప్రసాద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇవాళ సాయంత్రం ఆయన ఆయన బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి.

డిపార్ట్‌మెంటల్ అధికారులు విస్మరించడం వల్లే మంత్రి దినేష్ ఖతిక్ రాజీనామా చేసినట్లు పేర్కొంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో జలశక్తి శాఖ సహాయ మంత్రి ఖటిక్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాయడం రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, అతని స్వస్థలమైన మీరట్ జిల్లాలో మీడియా.. అతని రాజీనామాపై ప్రశ్నించగా.. ఖాటిక్ మరో విధంగా స్పందించారు. అలాంటి విషయం ఏం లేదంటూ పేర్కొన్నారు

కాగా.. ఉత్తరప్రదేశ్‌లో దళిత మంత్రులకు గౌరవం లేదని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ మండిపడ్డారు. గౌరవం దక్కకనే మంత్రి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. కాగా.. మంత్రి రాజీనామా చేయడం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్‌‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..