Punjab: పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య ఎన్‌కౌంటర్.. సిద్ధూ మూస్‌వాలా హత్య కేసు నిందితుడు హతం..
సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసులో నిందితులుగా ఉన్న జగ్‌రూప్ రూపా, మన్‌ప్రీత్ మన్నూలు అటారి దగ్గర చిచా బక్నా గ్రామంలో నక్కి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు పోలీసులపై కాల్పులు జరిపారు.
Sidhu Moose Wala Murder Case: పంజాబ్‌లోని పాక్ సరిహద్దు దగ్గర పోలీసులకు, గ్యాంగ్‌స్టర్లకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో మన్‌ప్రీత్‌మన్నూ అనే షార్ప్ షూటర్ హతమయ్యాడు. ముగ్గురు పోలీసులకు కూడా తీవ్రగాయాలయ్యాయి. ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసులో నిందితులుగా ఉన్న జగ్‌రూప్ రూపా, మన్‌ప్రీత్ మన్నూలు అటారి దగ్గర చిచా బక్నా గ్రామంలో నక్కి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు పోలీసులపై కాల్పులు జరిపారు. అనంతరం ఇరు వర్గాల మద్య కాల్పులు ప్రారంభమయ్యాయి. అమృత్‌సర్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని భక్నా గ్రామంలో ఈ ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఈ ప్రాంతంలో యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ చుట్టుముట్టారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని పోలీసులు సూచించినట్లు సమాచారం. అమృత్‌సర్ సమీపంలోని గ్రామానికి మూడు అంబులెన్స్‌లు చేరుకున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో జగ్‌రూప్ రూపా, మన్‌ప్రీత్ మన్నూ షార్ఫ్ షూటర్లు. మే 29వ తేదీన సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య జరిగింది. మూసేవాలా హత్యలో వీళ్లిద్దరు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మూసేవాలాపై తొలి తూటా పేల్చింది మన్‌ప్రీత్ మన్నూ అని పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది.
సింగర్, కాంగ్రెస్ నాయకుడు శుభదీప్ సింగ్ సిద్ధూ, అలియాస్ సిద్ధూ మూస్ వాలాను మే 29 న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని మూసా గ్రామం సమీపంలో కాల్చి చంపడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో పంజాబ్, ఢిల్లీ, ముంబైకి చెందిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ సతీందర్‌జిత్ సింగ్, అలియాస్ గోల్డీ బ్రార్ ఈ హత్యకు బాధ్యత వహించాడ. అతను ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సహాయంతో ఈ కుట్ర పన్నినట్లు పోలీసులు పేర్కొన్నారు.
#WATCH | Encounter ensuing between police & gangsters at Cheecha Bhakna village of Amritsar district in Punjab pic.twitter.com/7UA0gEL23z
— ANI (@ANI) July 20, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..