Payyavula Keshav: ఏపీ ఆర్థిక పరిస్థితిపై లోతైన అధ్యయనం జరగాలి.. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు..

శ్రీలంక కంటే నాలుగురెట్లు అధికంగా ఏపీ అప్పు చేసిందంటూ పీఏసీ చైర్మన్ పయ్యావుల పేర్కొన్నారు. దీంతో ఆర్థిక సంక్షోభం తలెత్తక మరేమవుతుందంటూ ప్రశ్నించారు.

Payyavula Keshav: ఏపీ ఆర్థిక పరిస్థితిపై లోతైన అధ్యయనం జరగాలి.. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు..
Payyavula Keshav
Follow us

|

Updated on: Jul 20, 2022 | 3:05 PM

Payyavula Keshav on AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక బాటలో సాగుతోందని తాము 4 నెలల నుంచి చెబుతున్నామని.. అదే విషయాన్ని కేంద్రం సైతం చెబుతోందని టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతైన అధ్యయనం జరిగి తీరాలంటూ పయ్యావుల డిమాండ్ చేశారు. ఈ మేరకు పయ్యావుల కేశవ్ బుధవారం మాట్లాడారు. శ్రీలంక కంటే నాలుగురెట్లు అధికంగా ఏపీ అప్పు చేసిందంటూ పీఏసీ చైర్మన్ పయ్యావుల పేర్కొన్నారు. దీంతో ఆర్థిక సంక్షోభం తలెత్తక మరేమవుతుందంటూ ప్రశ్నించారు. ఆర్థికమంత్రి CAG పూర్తిస్థాయి ఆడిట్2కు సిద్ధపడతారా..? లేక శ్వేతపత్రం విడుదల చేస్తారా..? అంటూ సవాల్ చేశారు. తమ లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే.. ప్రత్యేక ఆడిట్‌కు సిద్ధమా..? అంటూ ప్రశ్నించారు. చేస్తున్న అప్పులకు ఎందుకు లెక్కలు చూపట్లేదన్నారు.

పీఏసీ చైర్మన్ హోదాలో తాను అడిగిన వాటికి లెక్కల వివరాలు చెప్పట్లేదని పయ్యావుల ఆరోపించారు. రాష్ట్రానికి సంబంధించి వందలాది పీడీ అకౌంట్లకు లెక్కలు లేవని.. దీనిని నిరూపించేందుకు సిద్ధమంటూ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఇంకా మెతక వైఖరితో ఉండటానికి రాజకీయ కారణాలా..? లేక సమాఖ్య స్ఫూర్తా అనేది అర్థం కావట్లేదన్నారు. కేంద్రం కూడా అప్పులు చేసి తప్పు చేస్తోందని వైసీపీ భావిస్తే, ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లోనే నిలదీయొచ్చు కదా..? అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రం తప్పిదాలు చేస్తోందని ఎండగడుతుంటే, ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. పులులు అని చెప్పుకునేవారు ఏ విషయంలోనూ కేంద్రాన్ని నిలదీయకపోవటం గత కొంతకాలంగా చూస్తున్నామంటూ ఎద్దెవా చేశారు. తన భద్రత విషయంలో సీరియస్ కారణాలున్నాయని.. దీనికి సంబంధించి పార్టీ సూచనల మేరకు సరైన సమయంలో వెల్లడిస్తా అంటూ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.