Andhra Pradesh: అయ్య బాబోయ్.. 80 హస్తాలతో అరటి గెల.. ఎన్ని కాయలో తెల్సా..
ఈ అరటి చెట్టుకు ఉన్న గెలను చూస్తే మీరు షాక్ తింటారు. ఎందుకంటే అది 6 అడుగులు పైనే ఉంది. మాములుగా అయితే అరటి గెలలు 3 నుంచి 5 అడుగులే ఉంటాయి. దీంతో ఈ చెట్టును చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు.
Konaseema: కోనసీమ జిల్లా మల్కిపురం మండలం(Malikipuram Mandal) దిండి(Dindi) గ్రామంలో బాహుబలి అరటి గెల అందర్నీ ఆశ్చర్యం గురిచేస్తుంది. సాధారణంగా అరటి గెలకు ఐదు నుండి ఎనిమిది హస్తాలు ఉంటాయి. కానీ దిండి గ్రామ సర్పంచ్ ముదునూరి శ్రీనివాస్ రాజు పెరట్లో ఓ అరటి గెల మాత్రం అబ్బురపరుస్తుంది. ఇటువంటి అరటి గెలను మాత్రం మీరు చూసి ఉండరు. ఎందుకంటే ఆరడుగుల పొడవున్న ఆ గెలకు 80 హస్తాలు, 3,000 కాయలు ఉన్నాయి. దీంతో ఈ క్రేజీ అరటి గెలను చూసేందుకు స్థానికులు క్యూ కడుతున్నారు. ఈ అరటి గెలతో ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. గెల చుట్టూ అరటి కాయలతో విరగకాసింది. దీంతో ఈ అరటి గెలకు బాహుబలి బనానా అని పేరు పెట్టారు. అరటి గెల భారీగా పెరగటంతో బరువుకు చెట్టు విరగకుండా గెడలు సపోర్ట్‌గా పెట్టారు. ఇది సింగపూర్ ఆల్మండ్ కర్పూర రకం అరటని.. మలేషియా నుంచి పిలకను ప్రత్యేకంగా తెప్పించినట్లు ముదునూరి శ్రీనివాసరాజు తెలిపారు. బాహుబలి అరటి గెల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..