Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayapatnam Port: రామాయపట్నం పోర్ట్‌‌కు సీఎం జగన్ శంఖుస్థాపన.. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అంటూ హామీ..

CM YS Jagan Mohan Reddy: ఈ సందర్భంగా కావలి, కందుకూరు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఇదే పోర్టుకు టీడీపీ హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు శంకుస్థాపన చేసి ప్రజల్ని మోసం చేశారని సీఎం జగన్ విమర్శించారు.

Ramayapatnam Port: రామాయపట్నం పోర్ట్‌‌కు సీఎం జగన్ శంఖుస్థాపన.. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అంటూ హామీ..
Ap Cm Ys Jagan
Follow us
Venkata Chari

|

Updated on: Jul 20, 2022 | 4:02 PM

Ramayapatnam Port Bhoomi Pooja: పోర్టు నిర్మాణంతో రామాయపట్నం ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని సీఎం జగన్‌(CM YS Jagan Mohan Reddy) అన్నారు. నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం జగన్‌ ఈమేరకు మాట్లాడారు. అనంతరం ట్రెడ్జింగ్‌ పనులకు శ్రీకారం చుట్టి, పోర్టు నిర్మాణం జరిగే ప్రాంతంలో సముద్రుడికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, పారిశ్రామికవాడ కూడా వచ్చేలా చూస్తామని, ఏపీలో 50 కిలోమీటర్లకు ఒక ఫిష్షింగ్‌ హార్బర్‌, ఒక పోర్టు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. పోర్టుల్లోనూ 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయని తెలిపారు.

రామాయపట్నం పోర్టుకు భూములు ఇచ్చిన వారికి చేతులు జోడించి మరీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కావలి, కందుకూరు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఇదే పోర్టుకు టీడీపీ హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు శంకుస్థాపన చేసి ప్రజల్ని మోసం చేశారని సీఎం జగన్ విమర్శించారు.

ఇవి కూడా చదవండి