Lockdown: లాక్‌డౌన్ పొడిగించిన ఉత్తరప్రదేశ్ సర్కార్.. ఇవి తప్ప అన్నీ బంద్.. బయటకు రావాలంటే ఈ పాస్ తప్పనిసరి!
మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనాను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ తప్ప మరో మార్గం లేదని అంతర్జాతీయ నిపుణులు సైతం సూచిస్తున్నారు
Uttar Pradesh lockdown: మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనాను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ తప్ప మరో మార్గం లేదని అంతర్జాతీయ నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కరోనా సెకెండ్ వేవ్‌లో రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాతోసహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ఈనెల 10వ తేదీ వరకూ పొడిగించింది. ఉత్తరప్రదేశ్ అదనపు చీఫ్ సెక్రటరీ నవ్‌నీత్ సెహగల్ బుధవారంనాడు ఈ మేరకు ప్రకటించారు. తాజా లాక్‌డౌన్‌తో మే 10వ తేదీ ఉదయం 7 గంటల వరకూ కరోనా కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. ఈ సమయంలో నింబంధనలను కఠినంగా అమలు చేస్తు్న్నట్లు ఆయన తెలిపారు.
Uttar Pradesh government has decided to extend the partial ‘corona curfew’ till 7 am on May 10: ACS Information Navneet Sehgal
(file pic) pic.twitter.com/rKMKqvnAWi
— ANI UP (@ANINewsUP) May 5, 2021
రాష్ట్రవ్యాప్తంగా అన్ని దుకాణాలు, వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసే ఉంటాయని చెప్పారు. దీనికి ముందు గురువారం ఉదయం 7 గంటల వరకూ లాక్‌డౌన్‌ను యూపీ ప్రభుత్వం పొడిగించింది. లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సర్వీసుల కింద బయటకు వెళ్లాల్సి వస్తే ఇ-పాస్‌లు తప్పనిసరిగా పొందాలని పేర్కొంది. అధికారిక వెబ్‌సైట్ rahat.up.nic.in లో ఇ-పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లేవారికి మాత్రం ఇ-పాస్ అవసరం లేదు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోకతప్పదని నవ్‌నీత్ సెహగల్ హెచ్చరించారు. Read Also.. ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు..
తెలంగాణలో లాక్ డౌన్ ఉండబోదు.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే కరోనా అదుపులోనే ఉందిః సీఎస్
ఏపీ కర్ఫ్యూ.. ఆర్టీసీ కీలక నిర్ణయం.. టికెట్ల రిజర్వేషన్ క్యాన్సిల్.. ఎప్పటివరకంటే..?
అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చిందా? మీకు పీపీఎఫ్ ఖాతా ఉందా.. అక్కడ రుణం తీసుకోండి.. వివరాలు ఇవిగో..