Mamata Banerjee: ప్రమాణ స్వీకారం.. వెంటనే మమతా మార్క్.. కోవిడ్ నియంత్రణకు కఠిన మర్గదర్శకాలు..

West Bengal COVID-19 surge: ప‌శ్చిమ బెంగాల్ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మమతా బెనర్జీ పలు అంశాలపై అధికారులుతో

Mamata Banerjee: ప్రమాణ స్వీకారం.. వెంటనే మమతా మార్క్.. కోవిడ్ నియంత్రణకు కఠిన మర్గదర్శకాలు..
Mamata Banerjee
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 05, 2021 | 4:08 PM

West Bengal COVID-19 surge: ప‌శ్చిమ బెంగాల్ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మమతా బెనర్జీ పలు అంశాలపై అధికారులుతో సీరియస్‌గా చర్చించారు. బెంగాల్‌లో కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌ నేపథ్యంలో తాజాగా పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. రేపటి నుంచి లోక‌ల్ ట్రైన్ స‌ర్వీసుల‌ను నిలిపివేయ‌నున్నట్లు ప్రకటించారు. మార్కెట్లు, షాపులు ఉద‌యం ఏడు నుంచి ప‌దిగంట‌ల వ‌ర‌కు.. ఆపై సాయంత్రం ఐదు నుంచి ఏడు గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే తెరచి ఉంచాలని పేర్కొన్నారు. కోల్‌క‌తా మెట్రో స‌హా వాహ‌నాల్లో యాభై శాతం సీటింగ్ నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను యాభై శాతం హాజ‌రుతోనే నడిపించేందుకు అధికారులకు మార్గదర్శలు విడుదల చేశారు. ఇక ప్రైవేట్ కార్యాల‌యాల్లో స‌గం మంది సిబ్బందికి ఇంటి నుంచే ప‌నిచేసేందుకు అనుమ‌తించాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేశారు. షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్‌లు, సినిమాహాళ్లు, బ్యూటీ పార్ల‌ర్ల‌ను మూసివేయాల‌ని ఆదేశించారు. ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే విమాన ప్ర‌యాణీకుల‌ను రాష్ట్రంలోకి అనుమతించనున్నారు.

కాగా.. ప‌శ్చిమ‌బెంగాల్లో ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం చెల‌రేగిన హింస‌పై మ‌మ‌తాబెన‌ర్జీ మ‌రోమారు స్పందించారు. ఇలాంటి హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను తాము ఏమాత్రం స‌హించ‌బోమ‌ని ఆమె స్పష్టంచేశారు. అయితే, రాష్ట్రంలో ఎక్క‌డెక్క‌డైతే బీజేపీ గెలిచిందో అక్క‌డే ఎక్కువ‌గా హింస చెల‌రేగింద‌ని వివరించారు. పాత వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టి బీజేపీ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న‌ద‌ని మ‌మ‌తాబెన‌ర్జీ అరోపించారు.

ఇలాంటి హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలిపివేయాల‌ని ఆమె అన్ని పార్టీల వారిని కోరారు. ప‌శ్చిమ‌బెంగాల్ ఐక‌మ‌త్యానికి నిద‌ర్శ‌న‌మని, ఇక‌పై ఎవ‌రు హింస‌కు పురికొల్పినా స‌హించ‌బోన‌ని హెచ్చ‌రించారు. ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Also Read:

G7 meeting: జీ7 సదస్సులో కరోనా కలకలం.. పాల్గొనేందుకు వెళ్లిన ఇద్దరు భారత ప్రతినిధులకు పాజిటివ్

దిగివచ్చిన వైనం, ఈ నెలాఖరులోగా ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్, ఎయిరిండియా యాజమాన్యం హామీ