AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోకల్ ట్రెయిన్స్ రద్దు, బెంగాల్ లో ప్రవేశించాలంటే ఇక కోవిడ్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి, మమతా బెనర్జీ

బెంగాల్ లో కోవిడ్ కేసులు పెరిగిపోయిన దృష్ట్యా సీఎం మమతా బెనర్జీ కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినవెంటనే ఆమె.. రేపటి నుంచి లోకల్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

లోకల్ ట్రెయిన్స్ రద్దు, బెంగాల్ లో ప్రవేశించాలంటే ఇక కోవిడ్  నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి, మమతా బెనర్జీ
Mamata Banerjee
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 05, 2021 | 5:00 PM

Share

బెంగాల్ లో కోవిడ్ కేసులు పెరిగిపోయిన దృష్ట్యా సీఎం మమతా బెనర్జీ కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినవెంటనే ఆమె.. రేపటి నుంచి లోకల్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే బెంగాల్ లో ప్రవేశించేవారు తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ రిపోర్టులను సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ ఆంక్షలు శుక్రవారం నుంచి అమలులోకి వస్తాయన్నారు. విమాన ప్రయాణికులకు క్వారంటైన్ సౌకర్యాలను విమానాశ్రయ అధికారులే కల్పించాలన్నారు. రాష్టంలో మొత్తం లాక్ డౌన్ విధించే యోచన లేదని, నిత్యావసర సర్వీసులను ఆంక్షలనుంచి మినహాయించామని ఆమె చెప్పారు. విమానాల్లో లేదా దూర ప్రాంత రైళ్లు, అంతర్ రాష్ట్ర బస్సుల్లో ఈ రాష్ట్రానికి వచ్చేవారు నెగెటివ్ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ రిపోర్టులను తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. ఈ రిపోర్టులు లేనిదే ఎవరినీ అనుమతించేది లేదని స్ఫష్టం చేశారు.సామాజిక, రాజకీయ సమావేశాలను నిషేధించామని, అయితే ప్రత్యేక అనుమతితో పరిమిత సభ్యులతో సోషల్ గేదరింగులను అనుమతిస్తున్నామని మమత చెప్పారు. ప్రైవేటు కార్యాలయాలు సగం మంది సిబ్బందితో పని చేస్తాయని, బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు పని చేస్తాయని అన్నారు. షాపులు ఉదయం 7 గంటల నుంచి 10 గంటలవరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటలవరకు, జువెల్లరీ షాపులు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటలవరకు తెరిచి ఉంచుతారని వివరించారు. కోవిడ్ మందులు, ఆక్సిజన్, వ్యాక్సిన్ లభ్యతపై పారదర్శక విధానాన్ని పాటించాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోరానని, అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్ఛేలా చూడాలని అభ్యర్థించానని ఆమె వెల్లడించారు. జర్నలిస్టులకు ఉచిత టీకామందు ఇస్తామని, ఇందుకోసం ప్రత్యేకంగా సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆమె పేర్కొన్నారు. కాగా సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదట రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి సారించాలని గవర్నర్ జగ దీప్ ధన్ కర్ చేసిన సూచనను మమతా బెనర్జీ పక్కన పెట్టారు. దాని బదులు కోవిడ్ అదుపునకు తీసుకోవలసిన చర్యలకు ప్రాధాన్యమిచ్చారు.

మరిన్ని ఇక్కడ చూడండి: పండ్లు మంచివా పండ్ల రసాలు మంచివా..? శరీరానికి ఏ రూపంలో తీసుకుంటే బెటర్..! తెలుసుకోండి..

Covid-19 Curfew: ఏపీ కర్ఫ్యూ.. ఆర్టీసీ కీలక నిర్ణయం.. టికెట్ల రిజర్వేషన్ క్యాన్సిల్.. ఎప్పటివరకంటే..?