Kalyan Singh: యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమం.. లక్నో ఎస్‌జీపీజీఐ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత కల్యాణ్ సింగ్ (89) ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆయనను లక్నోలోని ఎస్‌జీపీజీఐ ఆసుపత్రిలో చేర్పించారు.
Uttar Pradesh Former CM Kalyan Singh admitted in Hospital: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత కల్యాణ్ సింగ్ (89) ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆయనను లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్‌జీపీజీఐ) ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యం క్షిణించడంతో వైద్యులు ఆయనను ఐసీయూకి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గత రెండు వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న కల్యాణ్‌సింగ్.. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, అక్కడ ఆయన ఆరోగ్యం విషమించడంతో వైద్యులు పీజీఐకి తరలించారు.
ఆయన మెదడులో రక్తం గడ్డ కట్టిందని, చికిత్స ద్వారా ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ రక్తపోటు పెరిగిందని, దీనికితోడు గుండెపోటు కూడా రావడంతో పరిస్థితి విషమించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రినాలజీ, న్యూరో ఆటోలజీ నిపుణులతో కూడిన బృందం ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నాయి. కల్యాణ్ సింగ్ రాజస్థాన్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్యాణ్ సింగ్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అంతకుముందు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కళ్యాణ్ సింగ్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
Defence Minister Rajnath Singh visits Lucknow’s Ram Manohar Lohia hospital to meet ailing former UP Chief Minister and BJP leader Kalyan Singh
Singh was admitted to the hospital late last night. pic.twitter.com/45euNDmqOO
— ANI UP (@ANINewsUP) July 4, 2021