Tamil Nadu: తమిళనాడులో ప్రముఖ ఆలయాల్లో భక్తులకు అనుమతి.. నేటి నుంచి తెరుచుకోనున్న టెంపుల్స్
Tamil Nadu: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అన్ని రంగాలతో పాటు ఆలయాలు సైతం మూతపడ్డాయి. కరోనా కారణంగా భక్తులకు అనుమతి లేకపోవడంతో ఆలయాలు..
Tamil Nadu: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అన్ని రంగాలతో పాటు ఆలయాలు సైతం మూతపడ్డాయి. కరోనా కారణంగా భక్తులకు అనుమతి లేకపోవడంతో ఆలయాలు వెలవెలబోతున్నాయి. ఫస్ట్‌వేవ్‌లో కంటే సెకండ్ వేవ్‌లో వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభించడంతో ఆలయాలు సైతం మూతపడ్డాయి. ఇక తమిళనాడులో మూత పడిన ఆలయాలలో నేటి నుంచి భక్తుల దర్శనాలకు అనుమతి ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ, లాక్ డౌన్ నిబంధనల నుండి ఆలయాలను మినహాయిస్తూ పుణ్యక్షేత్రాలలో దర్శనాలకు అనుమతి ఇచ్చింది తమిళ సర్కార్. రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలైన మధురై, శ్రీ రంగం ,తిరుత్తణి ,తిరువణ్ణామలై, రామేశ్వరం ఆలయాలలో కరోనా నిబంధలను పాటిస్తూ దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అన్ని పుణ్యక్షేత్రాలను శానిటైజ్ చేసిన అధికారులు.. చిన్నారులు ,వృద్ధు పుణ్యక్షేత్రాలలో దర్శనాలకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. సోమవారం నుంచి తెరుచుకోనున్న ఆలయాలలో భక్తులు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు ఆలయ అధికారులు. అయితే పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తులు ప్రతి ఒక్కరు మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని ఆలయ ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.
అయితే తమిళనాడు రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా.. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇటీవల లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జూలై 12 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్‌డౌన్ ఆంక్షలు పొడిగించిన కూడా చాలా వరకు ఆంక్షలను సడలించింది. అయితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 50 శాతం సామర్థ్యంలో హోటళ్లు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లు కూడా తెరుచుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో కార్యకలాపాలు సాగించుకోవచ్చు. అలాగే సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ ఫూల్స్, కళాశాలలు, జంతు ప్రదర్శనశాలలు తెరవడానికి వీలులేదని స్పష్టం చేసింది.