Paddy Without Verification: రైతులకు గుడ్‌న్యూస్.. వడ్లు కొనుగోలు చేసిన 72 గంటల్లో సొమ్ము.. సీఎం యోగి కీలక ఆదేశాలు

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రైతులకు భారీ బహుమతిని ప్రకటించింది. రాష్ట్రంలోని రైతులు ధృవీకరించకుండానే 100 క్వింటాళ్ల వరిని విక్రయించుకునేందుకు వీలు కల్పించింది.

Paddy Without Verification: రైతులకు గుడ్‌న్యూస్.. వడ్లు కొనుగోలు చేసిన 72 గంటల్లో సొమ్ము.. సీఎం యోగి కీలక ఆదేశాలు
Up Cm Yogi
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 24, 2021 | 7:48 PM

Paddy Without Verification in UP: ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రైతులకు భారీ బహుమతిని ప్రకటించింది. రాష్ట్రంలోని రైతులు ధృవీకరించకుండానే 100 క్వింటాళ్ల వరిని విక్రయించుకునేందుకు వీలు కల్పించింది. రైతుల సౌకర్యార్థం 100 క్వింటాళ్ల వరకు ధాన్యాన్ని రెవెన్యూ శాఖ వెరిఫికేషన్ నుండి మినహాయించారు. రాష్ట్రంలో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి ప్రభుత్వ వరి సేకరణ జరుగుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా రైతుల ప్రయోజనాలే ప్రధానమని, వరి ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేయాలని అన్నారు. వరి కొనుగోలు కేంద్రాలు సకాలంలో నడపాలని, 72 గంటల్లో పంట సొమ్ము చెల్లించాలన్నారు. వరి కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని ఏ స్థాయిలోనూ సహించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు..

వరిధాన్యాన్ని కొనుగోలు చేసే సంస్థలన్నీ పూర్తి పారదర్శకతతో కొనుగోలు చేయాలని సీఎం యోగి సూచించారు. ఇందులో ఎలాంటి జాప్యం చేయకూడదన్నారు. వరి కొనుగోలు కేంద్రాలు సకాలంలో నిర్వహించేలా చూడాలన్నారు. రైతులు పండించిన పంటలకు 72 గంటల్లోపు చెల్లించాలని ఆదేశించారు. డీఎంలు అందరూ తమ జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, వరి సేకరణ సజావుగా జరిగేలా చూడాలని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. రైతుల ప్రయోజనాలను విస్మరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యోగి హెచ్చరించారు.

ఉత్తరప్రదేశ్‌లోని 4370 కొనుగోలు కేంద్రాల్లో వరిని కొనుగోలు చేస్తున్నారు. వరి కొనుగోళ్లు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.1,461 కోట్ల 09 లక్షల విలువైన 7.52 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. నవంబర్ 20 నాటికి రాష్ట్రంలో 6.125 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేశారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) ప్రకారం, నవంబర్ 11 వరకు, దేశంలో 231.36 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో అత్యధికంగా 165.18 లక్షల మెట్రిక్ టన్నులు పంజాబ్‌లో సేకరించారు. మరిన్ని కొనుగోళ్ల కోసం పంజాబ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. హర్యానాలో 53.38 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించారు. ఉత్తరాఖండ్‌లో 5.36 టన్నుల వరిని కొనుగోలు చేశారు.

Read Also…  Viral Video: పైపు లైన్‌లో నీళ్లకు బదులు నోట్ల కట్టలు.. అవాక్కైన అధికారులు.. ఎక్కడంటే..?