Viral Video: పైపు లైన్‌లో నీళ్లకు బదులు నోట్ల కట్టలు.. అవాక్కైన అధికారులు.. ఎక్కడంటే..?
కర్ణాటకలోని ఓ పీడబ్ల్యూడీ జూనియర్ ఇంజనీర్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం జరిపిన దాడిలో అరుదైన ఘటనలో చోటుచేసుకుంది.
Karnataka Money spills out of pipe: కర్ణాటకలోని ఓ పీడబ్ల్యూడీ జూనియర్ ఇంజనీర్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం జరిపిన దాడిలో అరుదైన ఘటనలో చోటుచేసుకుంది. తాను అక్రమంగా సంపాదించిన సొమ్మును తన నివాసంలో ప్లాస్టిక్ పైప్‌లైన్‌లో దాచిన లక్షల రుపాయాలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.25లక్షలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి ఏసీబీ అధికారులు రిలీజ్ చేయడంతో వైరల్‌గా మారింది. ఏసీబీ అధికారులు పోస్ట్ చేసిన ట్వీటర్ వీడియోలో అధికారులు పైప్‌లైన్ నుండి కరెన్సీ నోట్లను రికవరీ చేస్తున్నట్లు కనిపించింది.
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై వివిధ శాఖలకు చెందిన 15 మంది ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం కర్ణాటక వ్యాప్తంగా 60 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. 8 మంది ఎస్పీలు, 100 మంది అధికారులు, 300 మంది సిబ్బందితో కూడిన బృందం 15 మంది అధికారుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే కలబురగి జిల్లాలోని పీడబ్ల్యూడీ జూనియర్ ఇంజనీర్ శాంతగౌడ బిరాదార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అయితే, తన అక్రమ సంపాదనంతా ఇంట్లోని నీటి పైపులో దాచినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్లంబర్ సహాయంతో కరెన్సీ నోట్లను బయటకు తీశారు ఏసీబీ అధికారులు.
కాగా, కర్ణాటకకు చెందిన ప్రభుత్వ అధికారులు మంగళూరుకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.ఎస్.లింగేగౌడ, మండ్యకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్.కె., దొడ్బళ్లాపూర్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనరశిమయ్య, బెంగళూరుకు చెందిన మాజీ ప్రాజెక్ట్ మేనేజర్ వాసుదేవ్, బెంగళూరుకు చెందిన జనరల్ మేనేజర్ బి.కృష్ణారెడ్డి, జాయింట్ డైరెక్టర్ టి.ఎస్.రుద్రేశప్ప గడగ్‌కు చెందిన 15 మంది అధికారులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. సోదాలు ప్రారంభించి అధికారులు అక్రమ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు.
#WATCH Karnataka ACB recovers approximately Rs 13 lakhs during a raid at the residence of a PWD junior engineer in Kalaburagi
(Video source unverified) pic.twitter.com/wlYZNG6rRO
— ANI (@ANI) November 24, 2021
TS Govt. on Yasangi Crop: యాసంగి పంటల సాగుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఎమన్నారంటే..?