Hyderabad: పెళ్లై 24 గంటలే.. యాక్సిడెంట్‌లో వరుడు మృతి.. కోమాలోకి వధువు

కోటి కలలతో పెళ్లి చేసుకున్నారు. అత్తగారింటికి వెళ్తుండగా నవ వరుడిని బలి తీసుకుంది రోడ్డు ప్రమాదం. ఇదే యాక్సిడెంట్‌లో వధువు తీవ్రంగా గాయపడింది.

Hyderabad: పెళ్లై 24 గంటలే.. యాక్సిడెంట్‌లో వరుడు మృతి.. కోమాలోకి వధువు
ప్రమాదంలో మృతి చెందిన శ్రీనివాసులు
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 24, 2021 | 8:22 PM

కోటి కలలతో పెళ్లి చేసుకున్నారు. అత్తగారింటికి వెళ్తుండగా నవ వరుడిని బలి తీసుకుంది రోడ్డు ప్రమాదం. ఇదే యాక్సిడెంట్‌లో వధువు తీవ్రంగా గాయపడింది. కోమాలోకి వెళ్లిపోయింది. ఇది మాటల కందని తీవ్ర విషాదమనే చెప్పాలి. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన శ్రీనివాసులుకు, తమిళనాడుకు చెందిన కనిమొళితో వివాహమైంది. తిరుపతిలో అంగరంగ వైభవంగా పెద్దలు కళ్యాణం జరిపించారు. సంప్రదాయం ప్రకారం.. తన భార్యతో కలిసి అత్తారింటికి బయల్దేరాడు వరుడు. అతనే కారు డ్రైవ్‌ చేస్తుండగా.. ఘోర ప్రమాదం జరిగింది. నవ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోగా.. అమ్మాయి కోమాలోకి వెళ్లిపోయింది. కారు నుజ్జునుజ్జైన పరిస్థితి చూస్తుంటేనే.. ప్రమాద తీవ్రత ఎంత ఉందో అర్థమవుతోంది. ఊహించని విషాదంతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. వాళ్ల బంధువులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కనిమొళి అయినా ప్రాణాలతో దక్కాలని వేడుకుంటున్నారు. అయితే ఆమె తలకు గాయాలవ్వడంతో.. ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Also Read: AP Weather: ఏపీకి మరో అల్పపీడన గండం.. మరోసారి ఆ జిల్లాలకే ముప్పు..

గుటక గుటకలో గరళం.. గరం గరం ఛాయ్‌లో విష రసాయనాలు.. టీ తాగేవారికి షాకింగ్ న్యూస్ 

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!